Mahaa Daily Exclusive

  గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత డయోగ్నస్టిక్ టెస్ట్‌లు…పేదప్రజల ఆరోగ్యానికి సుంకిరెడ్డి భరోసా

Share

కల్వకుర్తి, మహా
వినూత్న కార్యక్రమాలతో టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి దూసుకుపోతున్నారు. కల్వకుర్తి మండలం,
ఎల్లికట్ట గ్రామంలో ఐక్యత ఫౌండేషన్ ఛైర్మన్ టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మొబైల్ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఇందులో 300 మందికి పైగా క్యాంప్ కి హాజరవ్వగా..,
239 మందికి విజయవంతంగా రక్త పరీక్షలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సేవలు అందుబాటులో లేక,ఆరోగ్యంపై తగిన అవగాహన లేక చిన్న సమస్యలు కూడా పెద్దలు సమస్యలుగా మరి ఇబ్బందిపడుతున్న నిరుపేదప్రజలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గ వ్యాప్తంగా”సుంకిరెడ్డి ఆరోగ్య భరోసా” కార్యక్రమంలో బాగంగా ఏర్పాటు చేస్తున్న”సుంకిరెడ్డి – ఉచిత మొబైల్ హెల్త్ క్యాంప్” సేవలపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు సందర్భంగా సుంకిరెడ్డి మాట్లాడుతూ.. ఐక్యత ఫౌండేషన్ ద్వారా సుంకిరెడ్డి ఆరోగ్య భరోసా అనే కార్యక్రమంతో..నియోజకవర్గం నిరుపేద కుటుంబాలకు అండగా ఉండేందుకు
ఉచిత అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంచామని, తెలిపారు.
కంటి సమస్యలతో బాధపడుతూ వైద్యం చేయించుకోలేని పేద ప్రజల
ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ చూపునందించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాలలో నిరుపేద కుటుంబాలు ఆర్థిక భారంతో వైద్య పరీక్షలు నిర్లక్ష్యం చేస్తున్నారని, వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడం,వారికి తగిన నివారణ చర్యలను సూచించడం,గ్రామ స్థాయిలో ప్రజలలో ఆరోగ్య అవగాహన కల్పించడం,కోసమే ఈ ఉచిత మొబైల్ హెల్త్ క్యాంప్ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.ఈ కార్యక్రమంలో..
గ్రామస్తులు మాజీ సర్పంచ్ లింగమయ్య,గ్రామ సీనియర్ నాయకులు బంగారయ్య,మధు,కృష్ణయ్య శెట్టి, మల్లారెడ్డి,మధు సూదన్ రెడ్డి,కేశవులు,రవి,నంద్య నాయక్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Latest