సంగారెడ్డి, మహా : సంగారెడ్డి లో పోలీసు కానిస్టేబుల్ ఒకరు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికంగా కలకలం రేకెత్తించిన ఈ ఘటన సోమవారం సాయంత్రం జరిగింది. నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్‌కి చెందిన సందీప్ వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏడాదిగా సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా సందీప్ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ ఆడి కానిస్టేబుల్ సందీప్ భారీగా డబ్బులు నష్టపోయాడు. ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ ఆడటానికి తన సహాచరుల దగ్గర భారీగా అప్పులు కూడా చేశాడు. అయితే, అప్పుగా తీసుకున్న ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని సహాచర కానిస్టేబుళ్లు ఒత్తిడి చేయడంతో సందీప్ ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. కానిస్టేబుల్ సందీప్ ఆత్మహత్యపై ఎస్పీ పరితోష్ పంకజ్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది







