హైదరాబాద్, మహా: గత 10 ఏళ్లుగా బి.ఆర్.ఎస్ పార్టీ వల్ల జూబ్లీహిల్స్ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు.సోమవారం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా వెంగళరావు నగర్ డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.అనంతరం 100 మంది స్థానిక బి.ఆర్.ఎస్ పార్టీ సానుభూతి పరులను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ అనగానే ఎంతో అభివృద్ధి చెంది ఉంటుందని అనుకున్నా కానీ అసలు ఇక్కడ అభివృద్ధె లేదు.కాంగ్రెస్ ప్రభుత్వంతోనే జూబ్లీహిల్స్ అభివృద్ధి సాధ్యమన్నారు.అర్హులైన ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందించటమే మా ప్రభుత్వం లక్ష్యమని ఇందులో భాగంగానే గత ప్రభుత్వంలో అర్హుడై ఉండి సంక్షేమ పథకాలు అందని వారికి నూతన రేషన్ కార్డు మంజూరు చేసి పథకాలు అందిస్తున్నామని గుర్తు చేశారు.అంతేకాకుండా రేషన్ కార్డు ద్వారా ప్రతి పేదవాడికి 6 కిలోల సన్నబియ్యం అందిస్తున్నామని,మహిళా సాధికారతలో భాగంగా ఉచిత బస్,200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నాం అన్నారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖాయమని మీ అందరికీ చూస్తుంటే తెలుస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మానాల మోహన్ రెడ్డి,మనోజ్ రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నా







