- రోడ్లు ఖరాబ్ ఉంటే యాక్సిడెంట్స్ కావు
- రోడ్లు ఎంత మంచిగుంటే అంత పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి
- ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, మహా: చేవెళ్ల బస్సు ప్రమాదంపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్స్ కావు.. బండ్లు మెల్లగా పోతయ్.. రోడ్లు ఎంత మంచిగుంటే అంత పెద్ద ప్రమాదాలు జరుగుతాయన్నారు. 2016లో బీజాపూర్ జాతీయ రహదారి ప్రకటించారన్న ఆయన.. రియల్ ఎస్టేట్ కోసం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ చేయలేదని.. కేవలం బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. బస్సు ప్రమాదానికి కారణం వందకు వందశాతం గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇందుకు సబంధించిన ఆ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
Post Views: 20







