Mahaa Daily Exclusive

  చట్టంపై పట్టు సాధించాలి… డ్రగ్స్‌, గంజాయి అరికట్టడంలో కీలక పాత్ర పోషించాలి..

Share

  • చట్టంపై పట్టు సాధించాలి
  • డ్రగ్స్‌, గంజాయి అరికట్టడంలో కీలక పాత్ర పోషించాలి
  • ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచన

హైదరాబాద్, మహా: అభ్యర్థులు చట్టంపై పట్టు సాధించి డ్రగ్స్‌, గంజాయి, నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ వంటి వాటిని అరికట్టడంలో కీలక పాత్ర పోషించాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. మంగళవారం హైదరాబాద్ ఎక్సైజ్‌ అకాడమీలో గ్రూప్ సర్వీసుల ద్వారా ఎంపికైన అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ఎక్సైజ్ ఎస్సైలకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. లక్షలాది మంది పోటీపడిన పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థులను చూస్తే చాలా సంతోషమేస్తుందన్నారు. అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో యువకులు సాధించిన ఈ ఫలితాలు రాష్ట్ర పునర్నిర్మాణానికి బాటలు పరుస్తుందని అన్నారు. శిక్షణలో ఎక్సైజ్ అభ్యర్థులకు ఫిజికల్ ట్రైనింగ్ తోపాటు వెపన్‌ ట్రైనింగ్‌‌ను కూడా ఇస్తామని తెలిపారు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ఎక్సైజ్ ఎస్సైలకు శిక్షణలోనూ ప్రతిభ కనబరచాలని చెప్పారు

Latest