(మహా ప్రత్యేకం)
గోపీచంద్ హిందూజా దిగ్గజ వ్యాపారవేత్తనే కాదు.. ధర్మంతో వ్యాపారం, మానవత్వంతో సేవ సిద్దాంతంగా పెట్టుకున్నారు. ఆయన అడుగుపెట్టని రంగం లేదు. చేయని వ్యాపారం లేదు. హిందూజా గ్రూప్ చైర్మన్‌గా గోపీచంద్ పి. హిందూజా ప్రపంచ వ్యాపార రంగంలో భారతీయ గర్వంగా నిలిచారు. 100కు పైగా దేశాల్లో వ్యాపార విస్తరణతో హిందూజా గ్రూప్ గ్లోబల్ స్థాయిలో అగ్రగామిగా ఉంది. ఆటోమొబైల్, బ్యాంకింగ్, ఇంధనం, ఐటీ, హెల్త్‌కేర్ వంటి రంగాల్లో ఆయన దూరదృష్టి, వ్యూహాత్మక నిర్ణయాలు కీలక పాత్ర పోషించాయి. హిందూజా గ్రూప్ చైర్మన్, భారత సంతతికి చెందిన బిలియనీర్ గోపీచంద్ పి. హిందూజా బుధవారం లండన్ ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. నలుగురు హిందూజా సోదరులలో పెద్దవాడైన గోపీచంద్ పి. హిందూజా చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని కుటుంబ వర్గాలను ఉటంకిస్తూ వార్తా సంస్థ పిటిఐ నివేదించింది. బ్రిటిష్ హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడైన రేంజర్ ఒక ప్రకటనలో సంతాపాన్ని వ్యక్తం చేశారు. వ్యాపార రంగంలో ఆయనను “జీపీ” అని పిలుస్తారు. ఆయన భార్య సునీత, కుమారులు సంజయ్, ధీరజ్, కుమార్తె రీటా ఉన్నారు. రెండవ తరం హిందూజా కుటుంబ సభ్యుడైన గోపీచంద్ తన అన్నయ్య శ్రీచంద్ మరణం తర్వాత మే 2023లో చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.
గోపీచంద్ హిందూజా ఎవరు?
యుకె సండే టైమ్స్ రిచ్ లిస్ట్ ప్రకారం..జీపీ హిందూజా వరుసగా ఏడు సంవత్సరాలు యునైటెడ్ కింగ్డమ్లో అత్యంత ధనవంతుడు. 1940 లో భారతదేశంలో జన్మించిన ఆయన హిందూజా ఆటోమోటివ్ లిమిటెడ్ చైర్మన్‌గా కూడా పనిచేశారు. తండ్రి పి.డి. హిందూజా 1914లో ఇరాన్లో వ్యాపారం ప్రారంభించగా, గోపీచంద్ ఆ వారసత్వాన్ని ఆధునిక దిశగా నడిపించారు. సోదరులు శ్రీచంద్, ప్రమోడ్, అశోక్ హిందూజాలతో కలిసి హిందూజా గ్రూప్‌ను ప్రపంచ కార్పొరేట్ శక్తిగా తీర్చిదిద్దారు. “My Duty is My Religion” అనే తత్వంతో ఆయన నడిచే వ్యాపారశైలీ నైతికతకు నిదర్శనం. 2023లో తన సోదరుడు శ్రీచంద్ హిందూజా చిత్తవైకల్యంతో మరణించిన తర్వాత గ్రూప్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. గోపీచంద్ హిందూజా 1959లో ముంబైలోని జై హింద్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. వెస్ట్ మినిస్టర్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టర్ ఆఫ్ లాస్ డిగ్రీని పొందాడు. లండన్‌లోని రిచ్మండ్ కళాశాల నుండి ఆర్థిక శాస్త్రంలో గౌరవ డాక్టరేట్‌ను కూడా పొందాడు. హిందూజా కుటుంబ వ్యాపారాన్ని మొట్టమొదట 1914లో జి.పి. హిందూజా తండ్రి పరమానంద్ హిందూజా స్థాపించారు. ఆయనే స్థాపకుడు కూడా. గోపీచంద్ హిందూజా, ఆయన సోదరుడు శ్రీచంద్ హిందూజా ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేసి నేడు బిలియన్ డాలర్ల సమ్మేళనంగా మార్చారు.
హిందూజా ఫ్యామిలీ నెట్‌వర్త్:
పిచంద్ హిందూజా కుటుంబం బ్రిటన్‌లో అత్యంత ధనవంతులుగా నివేదించబడింది. ఫోర్బ్స్ రియల్-టైమ్ నెట్ వర్త్ ప్రకారం.. మంగళవారం నాటికి హిందూజా కుటుంబం నికర విలువ $20.6 బిలియన్లు లేదా దాదాపు రూ.182,668 కోట్లు. హిందూజా కుటుంబం లండన్‌లో రియల్ ఎస్టేట్ ఆస్తులను కలిగి ఉంది. వాటిలో వైట్‌హాల్‌లోని చారిత్రాత్మక ఓల్డ్ వార్ ఆఫీస్ భవనంలో ఉన్న రాఫెల్స్ లండన్ హోటల్ కూడా ఉంది.హిందూజా గ్రూప్ ఆటోమోటివ్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ, హెల్త్‌కేర్, రియల్ ఎస్టేట్, పవర్, మీడియా, వినోదం వంటి 11 రంగాలలో పనిచేస్తుంది. దాని ప్రసిద్ధ బ్రాండ్లలో అశోక్ లేలాండ్., ఇండస్ఇండ్ బ్యాంక్, నెక్స్ట్డిజిటల్ లిమిటెడ్ ఉన్నాయి.
…
జీపీ హిందూజా.. హైలెట్స్
– గోపీచంద్ పి. హిందూజా ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సామ్రాజ్యం నిర్మించిన హిందూజా గ్రూప్ ప్రస్తుత చైర్మన్.
– ఆయన కుటుంబ వ్యాపార వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రపంచ వ్యాప్తంగా 100కి పైగా దేశాల్లో వ్యాపార విస్తరణకు దోహదపడ్డారు.
– హిందూజా గ్రూప్ కార్యకలాపాలు ఆటోమొబైల్, ఎనర్జీ, బ్యాంకింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హెల్త్‌కేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాలలో విస్తరించి ఉన్నాయి.
– నైతిక విలువలు, కఠిన క్రమశిక్షణ, మరియు దీర్ఘదృష్టి ఆయన నాయకత్వ లక్షణాలు.
– హిందూజా గ్రూప్‌లో ఉద్యోగుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో ఉంది.
– అశోక్ లేలాండ్, ఇండిబ్యాంక్, గల్ఫ్ ఆయిల్, హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ వంటి ప్రముఖ కంపెనీలు ఆయన ఆధ్వర్యంలో ఉన్నాయి.
– లండన్‌లోని హిందూజా హాస్పిటల్ మరియు హెల్త్‌కేర్ వెంచర్స్‌కు ఆయన ప్రోత్సాహకుడు.
– ముంబైలోని పీ.డి. హిందూజా హాస్పిటల్ ప్రపంచస్థాయి వైద్య సేవల కేంద్రంగా ప్రసిద్ధి పొందింది.
– 2023లో హిందూజా కుటుంబం బ్రిటన్‌లో అత్యంత సంపన్న కుటుంబంగా గుర్తింపు పొందింది.
– ఫోర్బ్స్ బిలియనీర్స్ లిస్టులో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది.
– వ్యాపారానికి తోడు ఆయన ఆధ్యాత్మికతకు కూడా పెద్ద ప్రాధాన్యత ఇస్తారు.
– బ్రిటన్-ఇండియా బిజినెస్ సంబంధాలను బలపర్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
– హిందూజా గ్రూప్ వార్షిక ఆదాయం బిలియన్ల డాలర్లలో ఉంది.
– గోపీచంద్ హిందూజా ప్రపంచవ్యాప్తంగా భారతీయ వ్యాపార ప్రతిష్ఠను పెంచిన ప్రముఖ వ్యాపారవేత్త.
– “ధర్మంతో వ్యాపారం – మానవత్వంతో సేవ” ఆయన జీవన తత్వానికి మూల సూత్రం







