Mahaa Daily Exclusive

  అమీన్ పీర్ దర్గాలో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ప్రార్ధనలు

Share

కడప, మహా

కడప జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ప్రసిద్ధ అమీన్ పీర్ దర్గాలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ప్రార్థనలు నిర్వహించారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరుపున జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి చాదర్ సమర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డితో కలిసి తలపై పూల చాదర్ పెట్టుకొని సాంప్రదాయ పద్ధతిలో దర్గాకు సమర్పించారు. ఆసర్ ఎ ముబారక్ లో మొహమ్మ ద్ ప్రవక్త వారి వంశీకుల పవిత్ర ఆనవాలను పీఠాధిపతి ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పి షెల్కే నచికేత్ విశ్వనాథన్, జిల్లా ఉన్నతాధికారులు దిశా పోలీస్ స్టేషన్ నుండి పెద్ద దర్గా వరకు కాలినడకన చాదర్ తీసుకొని వచ్చి హజారత్ సూఫీ సర్ మస్త్ సాని చిల్లా కష్ ఖ్వాజా సయ్యద్ షా ఆరిఫుల్లా మొహమ్మద్ మొహమ్మద్ హుస్సేనీ చీష్టి ఉల్ ఖాదరి వారి మజార్ పై సమర్పించారు

Latest