Mahaa Daily Exclusive

  కోటి దీపోత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తిస్తాం:ముఖ్యమంత్రి

Share

  • కోటి దీపోత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తిస్తాం
  •  ఎన్టీవీ టీవీ ఆధ్వర్యంలో ‘కోటి దీపోత్సవం’ వేడుకలు
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీ సమేతంగా హాజరు

హైదరాబాద్, మహా: భక్తి టీవీ కోటి దీపోత్సవాన్ని రాష్ట్రపండుగగా గుర్తిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాదు జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రానికి లేఖ రాస్తామని సీఎం వెల్లడించారు. భక్తి, ఎన్టీవీ టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం’ వేడుకలు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఎనిమిదో రోజు ఎన్టీఆర్ స్టేడియం అపూర్వమైన ఆధ్యాత్మిక కాంతులతో మిన్నంటింది. ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణం శివభక్తి జ్యోతులతో నిండిపోగా, భక్తి, ఆరాధనలతో నిండిన ఆ వాతావరణం ప్రతి భక్తుడి మనసును మైమరిపించింది. కార్తీకమాసం సందర్భంగా ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీలు ప్రతీ ఏటా నిర్వహించే ఈ మహోత్సవం, ఈసారి మరింత వైభవంగా, మహిమాన్వితంగా సాగుతోంది. ఈ విశిష్టమైన కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీ సమేతంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వచ్చిన సీఎం రేవంత్‌ రెడ్డి దంపతులకు వేద మంత్రాలతో స్వాగతించారు. ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి దంపతులు సీఎం రేవంత్ కు ఘనస్వాగతం పలికారు

Latest