Mahaa Daily Exclusive

  మాగంటి గోపీనాథ్ ఆస్తులపై కుట్ర: కేటీఆర్, రేవంత్‌లపై బండి సంజయ్ సంచలన ఆరోపణలు

Share

  • గోపీనాథ్‌పై బీఆర్ఎస్‌కు ప్రేమ లేదు
  • మాగంటి గోపీనాథ్ ఆస్తులపై కుట్ర జరుగుతుంది
  • కేటీఆర్‌తో కలిసి ఆస్తుల్లో వాటాకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర
  • కేంద్రమంత్రి బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్

హైదరాబాద్, మహా: దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌పై బీఆర్ఎస్‌కు ప్రేమ లేనేలేదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గోపీనాథ్ ఆస్తులపై ఆమె సతీమణి సునీతతో కలిసి మాజీ మంత్రి కేటీఆర్ కుట్ర చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గోపీనాథ్ ఆస్తులను కాజేసేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. అందుకే గోపీనాథ్ ఆస్తులను తారుమారు చేసేందుకు ఈ కుట్రలకు తెరదీశారని ఆక్షేపించారు. ఒక ఓటరు కార్డులో సునీత భర్త పేరు సునీత మనోహర్ అని ఉందని… ఇంకో ఓటరు కార్డులో సునీత భర్త పేరు మాగంటి గోపీనాథ్ అని ఉందని ఆరోపించారు. ఇదిగో ఆ ఓటరు కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వానికి పంపిస్తున్నానని వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 2023 ఎన్నికల అఫిడవిట్‌లో మాగంటి సునీత చదువుకోలేదని రాసిచ్చారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక భాగంగా ఆదివారం బండి సంజయ్ పాదయాత్ర చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

2025లో ఎన్నికల అఫిడవిట్‌లో పదోతరగతి వరకు మాగంటి సునీత చదువుకున్నారని రాసిచ్చారని చెప్పుకొచ్చారు. ఆధారాలు పంపిస్తున్నానని సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆ ఆధారాలను, తన దగ్గరున్న సమాచారాన్ని పోలీసులకు పంపించానని స్పష్టం చేశారు. గోపీనాథ్‌‌ని కన్నతల్లి కూడా చూడనీయకుండా ఏఐజీ ఆస్పత్రి యాజమాన్యంతో కేటీఆర్ నోటీసులు ఇప్పించారని ఆరోపించారు. పొరపాటున బీఆర్ఎస్‌ను గెలిపిస్తే… జూబ్లీహిల్స్ ప్రజల ఇళ్ల పత్రాలను తారుమారు చేసి దోచుకుంటారని ఆరోపించారు. . మాగంటి గోపీనాథ్ కొడుకును ఇండియాకు రాకుండా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బెదిరించిన మాట వాస్తవమని తెలిపారు. వాటికి సంబంధించిన ఆడియో క్లిప్పింగ్స్‌ను గోపీనాథ్ కుటుంబ సభ్యులు చూపించారని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లోని పార్కులను కూడా దోచుకుంటారు జాగ్రత్త అని హెచ్చరించారు. కేటీఆర్‌తో కలిసి గోపీనాథ్ ఆస్తుల్లో వాటాకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర పన్నారని ఆరోపించారు. అందుకే గోపీనాథ్ మరణం మిస్టరీపై, ఆస్తులపై విచారణ జరిపించడం లేదని విమర్శించారు. గోపీనాథ్‌కి చేతకాని పరిస్థితులో ఏఐజీ ఆస్పత్రిలో ఉంటే ఆయన తల్లిని ఎందుకు రానీవ్వలేదని ప్రశ్నించారు. కానీ అదే ఆస్పత్రిలో 9వ ఫ్లోర్‌లో మాజీ మంత్రి కేటీఆర్, ఆయన సతీమణి తిష్టవేసి ఆస్తులను కాజేసే కుట్రకు తెరదీసింది నిజం కాదా..? అని నిలదీశారు. అందుకే చెబుతున్నా… జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లను ఓడించాలని పిలుపునిచ్చారు.

Latest