Mahaa Daily Exclusive

  దానం రెడీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే సిద్దం..!

Share

హైదరాబాద్, మహా

సుప్రీం ఆగ్రహం నేపథ్యంలో తనపై అనర్హత వేటు పడకముందే రాజీనామాకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సై అంటున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ హైకమాండ్ అనుమతిస్తే ఎపుడంటే అపుడు తాను రాజీనామా చేస్తానని, తాను గెలిచాక మంత్రి పదవి ఇవ్వాలని ఆయన కోరుతున్నట్లు తెలిసింది. వారం రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని మొదట కోర్టు ఆదేశించగా, న్యాయవాదుల వినతితో నాలుగువారాల గడువిచ్చినట్లు తెలుస్తోంది. వారంలో నిర్ణయం తీసుకున్నా, నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకున్నా.. నిర్ణయం తప్పనిసరి అని, దానం నాగేందర్ పక్కకు తప్పుకోవడానికి ఆస్కారం లేదన్న చర్చ జరుగుతోంది. దానం నాగేందర్ తో పాటు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా రాజీనామా కు సిద్దంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్ గెలుపు ఊపుమీదున్న కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ బైపోల్ వచ్చినా సునాయాసంగా గెలుస్తామన్న ధీమాలో ఉంది.

………..

Latest