- సీఎం సార్.. మా పెళ్లికి రండి
- రేవంత్‌కు ఇన్విటేషన్ అందజేసిన రాహుల్ సిప్లిగంజ్
హైదరాబాద్, మహా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ మంగళవారం కలిశారు. ఈనెల 27న వివాహం చేసుకోబోతున్న రాహుల్ సిప్లిగంజ్.. ముఖ్యమంత్రిని కలిసి వివాహ శుభకార్యానికి ఆహ్వానించారు. కాగా, ఇటీవలే.. తెలుగుదేశం పార్టీ నేత, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్న కుమార్తె హరిణ్యా రెడ్డితో రాహుల్ ఎంగేజ్‌మెంట్ జరిగింది. కొద్ది మంది అతిథుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో సినీ ప్రముఖులతోపాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు హాజరయ్యారు. ఇక, ఓల్డ్ సిటీ నుంచి ‘ఆస్కార్’ వరకూ వెళ్లిన కుర్రాడంటూ రాహుల్‌ను ‘గద్దర్’ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలో సీఎం రేవంత్ ప్రశంసించిన విషయం తెలిసిందే.
Post Views: 24






