Mahaa Daily Exclusive

  పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష రద్దు

Share

  • 2015- 16 గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ షాక్
  • పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష రద్దు
  • తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
  • హైకోర్టు ఆదేశాలను టీజీపీఎస్సీ ఉల్లంఘించిందని అసహనం
  • పునర్‌మూల్యంకనం చేయాలని టీజీపీఎస్సీకి ఆదేశాలు

హైదరాబాద్, మహా: పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూప్-2 పరీక్షను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. 2015- 16లో నిర్వహించిన గ్రూప్-2 పరీక్షను రద్దు చేస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. హైకోర్టు ఆదేశాలను టీజీపీఎస్సీ ఉల్లంఘించిందని, పరిధిదాటి వ్యవహరించిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పునర్‌ మూల్యాంకనం చేసి అర్హుల జాబితా నిర్ణయించాలని, ఈ ప్రక్రియ 8 వారాల్లో ముగించాలని హైకోర్టు ఆదేశించింది. వైట్నర్‌, దిద్దుబాటు ఉన్న జవాబుపత్రాల మూల్యాంకనంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ట్యాంపరింగ్‌ జరిగినట్లు తెలిసినా.. మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొంది. సాంకేతిక కమిటీ సూచన ప్రకారం పునర్‌మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. 2015లో టీజీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2016 నవంబర్‌లో రాతపరీక్షలు నిర్వహించింది. 2019లో గ్రూప్‌-2 నియామకాలు చేపట్టింది. దీనిపై పలువురు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్‌ నగేశ్‌ భీమపాక తీర్పు వెలువరించారు.

2015-16 గ్రూప్-2 పరీక్ష వివరాలివి..
మొత్తం పోస్ట్‌లు – 439.
అప్లికేషన్లకు గడువు – 2025 డిసెంబర్ 31 నుంచి 2016 ఫిబ్రవరి 9 వరకూ.
పరీక్షల తేదీలు – 2016 ఏప్రిల్ 24, ఏప్రిల్ 25.
ప్రధాన పోస్ట్‌లు – ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ -220
అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ – 110
ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ – 67
సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ -2 పోస్ట్‌లు- 23
మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-3 పోస్ట్‌లు -19
వీటితో పాటు డిప్యూటీ తహసిల్దార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-1, టెక్నికల్ గ్రేడ్-2(హెచ్‌ఎండబ్ల్యూ, ఎస్‌బీ), డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) (హెచ్‌ఎండబ్ల్యూ, ఎస్‌బీ).

Latest