Mahaa Daily Exclusive

  పీచుపల్లి సర్పంచ్ ఏకగ్రీవం: రూ.10 లక్షల ప్రోత్సాహక నిధులు! ఇచ్చిన హామీ మేరకు రూ.10 లక్షలు కేటాయించనున్న కేంద్ర మంత్రి బండి సంజయ్!

Share

  • పీచుపల్లిలో సర్పంచ్ పదవి ఏకగ్రీవం
  • బీజేపీ బలపర్చిన అభ్యర్ధి రాజిరెడ్డి ఒక్కరే నామినేషన్
  • గ్రామాభివ్రుద్దికి రూ.10 లక్షల నిధులు కేటాయిస్తానన్న కేంద్ర మంత్రి బండి సంజయ్
  • బీజేపీ అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే గ్రామాభివృద్ధి కోసం నిధులు తెస్తానని హామీ

కరీంనగర్, మహా : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత నామినేషన్ల దాఖల పర్వం పూర్తయింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పీచుపల్లి గ్రామంలో సర్పంచ్ పదవికి బీజేపీ బలపర్చిన సామ రాజిరెడ్డి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల గడువు కూడా ముగియడంతో సామ రాజిరెడ్డి ఎన్నిక ఏకగ్రీవం లాంఛనమే కానుంది. సర్పంచ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపర్చిన అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే ఆ గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున ప్రోత్సాహక నిధులను కేటాయిస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లాలో బీజేపీ పక్షాన తొలి ఏకగ్రీవం కావడంతో ఇచ్చిన మాట మేరకు ఆయా నిధులను అందజేస్తానని బండి సంజయ్ తెలిపారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సైతం ఎన్నికల్లేకుండా సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యే గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున ప్రోత్సాహక నిధులిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లెక్కన పీచుపల్లి మొత్తం రూ.20 లక్షల ప్రోత్సాహక నిధులు అందనున్నాయి. ఈ నిధులను తమ గ్రామాన్ని అభివ్రుద్ధి చేసుకుంటామని ఆయా గ్రామస్తులు చెబుతున్నారు. ఈ మేరకు గ్రామాభివ్రుద్ధికి అవసరమైన పనులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.

Latest