Mahaa Daily Exclusive

  ఢిల్లీలో రేవంత్ బిజీబిజీ….

Share

  • ఢిల్లీలో రేవంత్ బిజీబిజీ
  • ప్రధాని మోడీతో పాటు పలువురు మంత్రులతో భేటీ
  • రాహుల్, ప్రియాంక, ఖర్గేలకూ ఆహ్వానం
  • తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని ఆహ్వానం

న్యూఢిల్లీ, మహా : ముఖ్యమంత్ర రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మోదీతో చర్చించారు. హైదరాబాద్-బెంగళూరు-చెన్నై బుల్లెట్ ట్రైన్ కావాలని రేవంత్ కోరారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు అనుమతి ఇవ్వాలని విన్నవించారు. కాగా ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కూడా ఈ సమ్మిట్‌కు ఆహ్వానించారు.

ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించిన గ్లోబల్​ సమ్మిట్​ ఆహ్వాన పత్రికను ప్రధానికి సీఎం అందించారు. కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్న వికసిత్​ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ​ 3 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యంగా తెలంగాణ భవిష్యత్తు సంకల్పంతో ముందుకు సాగుతుందని సీఎం ప్రధానికి ఈ సందర్భంగా వివరించారు. దీనికి అనుగుణంగా అన్ని రంగాల వృద్ధి లక్ష్యాలు, అనుసరించే భవిష్యత్తు ప్రణాళికలను విశ్లేషించేలా తెలంగాణ రైజింగ్​ 2047 విజన్​ డాక్యుమెంట్​ రూపొందించినట్లు చెప్పారు. నీతి అయోగ్​ సలహాలు సూచనలతో పాటు అన్ని రంగాల నిపుణుల మేథో మథనంతో తయారు చేసిన ఈ విజన్​ డాక్యుమెంట్​ ను గ్లోబల్​ సమ్మిట్​ లో ఆవిష్కరించనున్నట్లు సీఎం ప్రధానికి వివరించారు.

ఈ క్రమంలోనే మంగళవారం కొత్తగూడెంలో బహిరంగ సభ ముగించుకుని వెంటనే బేగంపేట విమానాశ్రయం నుంచి రేవంత్ ఢిల్లీ చేరుకున్నారు. అక్కడ మంగళవారమే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలిసి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించారు.

Latest