Mahaa Daily Exclusive

  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్: అవమానాల నుంచి అఖండ విజయ శిఖరం వరకు

Share

  • అవమానాలు ఎదుర్కొన్నా
    చోటే చరిత్రను తిరగరాసి..
  • పట్టు వదలనీ విక్రమార్కుడు..
  • తలెత్తుకొని
    అఖండ విజయం సాధించి..
  • వరుస ఓటములు
    గెలుపునకు బాటలు
  • అడ్డంకులు చీల్చుకుంటూ..
    లక్ష్యాన్ని సాధించి..
  • సామాన్య కార్యకర్త నుంచి మంత్రి స్థాయి వరకు ఎదిగిన అడ్లూరి..
  • నిరుపేద కుటుంబం నుంచి.. రాజకీయాల్లో రాణించి..
  • నాడు బిఆర్ఎస్ పాలకుల
    నిర్బంధాలను బద్దలు కొట్టి..
  • ప్రజాసేవకే జీవితం అంకితం..
  • అన్నా అంటే నేను ఉన్నానంటాడు..
  • ప్రజల కష్ట సుఖాల్లో తోడునీడగా నిత్యం వెన్నంటే ఉండి..
  • ధర్మపురి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర..
  • ఇది మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాజకీయ ప్రస్థానం..
  • ఎమ్మెల్యేగా గెలిచి విజయవంతంగా మూడో సంవత్సరంలోకి అడుగుడిన మంత్రి లక్ష్మణ్ కుమార్

రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వారు కాదు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు వారి కుటుంబంలో వారసులు లేరు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. స్వయంకృషితో రాజకీయాల్లో ఎదిగారు. కష్టాన్ని నమ్ముకున్నారు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అయినా గుండె నిబ్బరం చేసుకుని కృషి పట్టుదలతో ముందుకెళ్లారు. వరుసగా ఓటమి చెందినా ఎలాంటి నిరాశ చెందకుండా తన పని తాను చేసుకు పోయారు. అనేక అవమానాలు నిర్బంధాలు ఎదుర్కొన్నారు. వరుస ఓటములు విజయానికి బాటలు వేసుకున్నారు. బీఆర్ఎస్ పాలకులు అనేక అవమానాలు నిర్బంధాలు విధించినా నేర్పుతో ఓర్చుకున్నారు. నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అండగా నిలిచారు. అవమానాలు ఎక్కడైతే ఎదుర్కొన్నారో తలెత్తుకొని అఖండ విజయం సాధించి చరిత్రను తిరగరాసారు. పట్టు వదలని విక్రమార్కుడిలా లక్ష్యాన్ని సాధించి రికార్డు సృష్టించారు. అడ్డంకులు చీల్చుకుంటూ ముందుకు సాగారు.
సామాన్య కార్యకర్త నుంచి మంత్రి స్థాయి వరకు ఎదిగారంటే ఆషామాషి విషయం కాదు
నిరుపేద కుటుంబం నుంచి రాజకీయాల్లో వచ్చి సక్సెస్ సాధించారు. నాడు బిఆర్ఎస్ పాలకుల నిర్బంధాలను బద్దలు కొట్టి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అన్న లాగా నిలిచారు. ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేశారు. అర్ధరాత్రి అపరాత్రి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు ఆపద వచ్చి తలుపు తట్టి అన్నా అంటే నేను ఉన్నానంటారు.
ప్రజల కష్ట సుఖాల్లో తోడునీడగా నిత్యం వెన్నంటే ఉంటారు. చేతనైన సహాయాన్ని చేస్తారు. సమస్యల పరిష్కారానికి అంకితమై పనిచేస్తారు. ప్రజల ఇబ్బందులను తన ఇబ్బందులుగా భావిస్తాడు. ధర్మపురి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. నాలుగుసార్లు పరాజయం పాలై ఐదోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయనను ధర్మపురి ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. ఇంతకీ ఈ చరిత్ర అంతా ఎవరిదో అనుకుంటున్నారా. ధర్మపురి ఎమ్మెల్యే రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాజకీయ ప్రస్థానం ఇది.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి ఎమ్మెల్యేగా గెలిచి విజయవంతంగా మూడో సంవత్సరంలోకి అడుగుడిన సందర్భంగా ఎస్సీ ఎస్టీ సంక్షేమ మంత్రి లక్ష్మణ్ కుమార్ గురించి స్పెషల్ స్టోరీ..

పేద కుటుంబానికి చెందిన వారు మంత్రి లక్ష్మణ్ కుమార్. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు రాజకీయ వారసులు ఎవరు లేరు అయినప్పటికీ స్వయంకృషితో రాజకీయాలకు వచ్చి మంత్రి స్థాయి వరకు ఎదిగారు. సామాన్య కార్యకర్త నుంచి మంత్రి పదవి చేపట్టడం ఆయన జీవితంలో మర్చిపోలేని ఘటన. లక్ష్మణ్ కుమార్ మొదటి నుంచి ఆర్థికంగాను అంతంత మాత్రమే. అట్టడుగు వర్గాల దళిత మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ప్రజల అందరితోనూ ఆత్మీయతతో అనురాగంతో మెదులుతారు. అదేవిధంగా తనకంటే పెద్దవారిని గౌరవిస్తారు. అధికారులతోనూ మర్యాదగా వ్యవహరిస్తారు. అందరికీ ఆత్మీయుడు ఆత్మబంధువు ప్రజా బంధువు.

రాజకీయ నేపథ్యం..

అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1982 నుండి 85 వరకు గోదావరిఖని జూనియర్ కళాశాల ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు. కోల్ బెల్ట్ ప్రాంతంతో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ది విడదీయలేని బంధం. ఆయన రాజకీయ ఎదుగుదలలో గోదావరిఖని కీలకంగా పనిచేసింది. 1986 నుండి 94 వరకు ఎన్‌ఎస్‌యూఐ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 1996 నుండి 2001 వరకు ఏపీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 2006లో ధర్మారం (ఎస్సీ) రిజర్వుడ్ స్థానం నుంచి జడ్పీటీసీగా పోటీ చేసి గెలిచాడు. ఆయన 1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మేడారం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు.

అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 2010 నుండి 2012 వరకు కరీంనగర్ జడ్పీ ఛైర్మన్‌గా పని చేశాడు. ఆయన 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2018లో ధర్మపురి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. లక్ష్మణ్ కుమార్ 2013 నుండి 14 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పని చేశాడు.

అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆ తరువాత జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితుడై, 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పై 22,039 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2023 డిసెంబర్ 9న శాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశాడు.
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను 2023 డిసెంబర్ 15న ప్ర‌భుత్వ విప్‌గా ప్ర‌భుత్వం నియ‌మించింది.
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 2025 జూన్ ఎనిమిదో తేదీన మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. జూన్ 12న నల్గొండ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగా నియమితులయ్యారు. ఆయన జూన్ 21న సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

విద్యార్థి సంఘం నేత నుంచి..

విద్యార్థి దశలో ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి సంఘం నాయకుడిగా, రంగ ప్రవేశం చేసిన లక్ష్మణ్ కుమార్ , బాల్యం, విద్యాభ్యాసం సింగరేణి ప్రాంతం సింగరేణి ప్రాంతంలోనే సాగింది. మంత్రి లక్ష్మణ్ కుమార్ రాజకీయ ప్రస్థానం దశాబ్దన్నర కాలం పాటు పూల బాట కాలేదు, ఆయన పాలిట ముళ్ళబాట అయ్యింది. అందులోనే అడుగులు వేస్తూ, ప్రజా సమస్యలపై అనేక ఆందోళనలు నిర్వహించారు. నాటి అధికార బీఆర్ఎస్ పార్టీకి పెను సవాల్ గా మారారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టారు. నిత్యం ప్రజలతో మమేకమై ముందుకు సాగారు
మంత్రి లక్ష్మణ్ కుమార్, రెండు సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలోఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్ గా క్యాబినెట్ మంత్రిగా పదోన్నతులు పొందారు. ఒక్కొక్క మెట్టు అధిగమించారు. ఎమ్మెల్యేగా గెలిచి ముచ్చట గా మూడో సంవత్సరంలో కి అడుగుపెట్టారు

బీఆర్ఎస్ పాలకుల వైఫల్యాలను ఎండగట్టి..

నాటి అధికార బీఆర్ఎస్ పార్టీ ధర్మపురి నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న ఇతనాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం పనులు అడ్డుకున్నారు, ఫ్యాక్టరీ నిర్మాణ పనులు నిలిచిపోవడానికి లక్ష్మణ్ కుమార్, చేసిన ప్రజా పోరాటాలలో ఒక మైలు రాయిగా నిలిచింది. ఆయన రాజకీయ ప్రస్థానంలో కీలక పోరాటంగా గుర్తింపు తీసుకొచ్చింది.
తప్పుడు కేసుల నమోదు, అర్ధరాత్రి అపరరాత్రి ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలు, వరుస ఓటములు, రాజకీయ ప్రత్యర్థుల హేళనలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, నాటి ప్రతిపక్ష పార్టీల కీలక నాయకులు తమ పార్టీ లోకి రమ్మని ప్రలోభాలు, రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవుల ఆశలు కల్పించిన, కాంగ్రెస్ పార్టీని వీడని కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా గుర్తింపు పొందారు. బీఆర్ఎస్ నిర్బంధాలను ఎప్పటికప్పుడు ధైర్యంగా ఎండగడుతూ ముందుకు సాగి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అండగా నిలిచారు.

2009 లో నూతనంగా ఆవిర్భవించిన ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో (రిజర్వుడు) 14 సంవత్సరాల తర్వాత. కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకొని కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన లక్ష్మణ్ కుమార్ 2009 నుంచి ఎమ్మెల్యే పదవికి పోటీ చేశారు . 2009, 2010, 2014, 2018, ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతిలో వరుసగా పరాజయం పాలయ్యారు. ఓటమి చెందిన నిరాశ నిస్పృహలకు లోను కాలేదు లక్ష్మణ్ కుమార్. ధైర్యంగా పట్టుబదలని విక్రమార్కుడిలా మెదిలారు బీఆర్ఎస్ నిత్యం పెట్టే అవమానాలను భరించలేక లక్ష్మణ్ కుమార్, ఆయన క్యాడర్ లో కసి పట్టుదల పెంచుకున్నారు.

2023 ఎన్నికల్లో చావో, రేవో అంటూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు కుటుంబ సభ్యులు, కలిసికట్టుగా లక్ష్మణ్ కుమార్ గెలుపు కోసం అహో రాత్రులు కృషి చేశారు. నియోజకవర్గ ఓటర్లు ,ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. ప్రజలంతా ఓట్లు వేసి ఆశీర్వదించారు వారి హృదయాల్లో పెట్టుకున్నారు. 22 వేల ఓట్ల మెజార్టీతో లక్ష్మణ్ కుమార్ ధర్మపురి ఎమ్మెల్యేగా రెండు సంవత్సరాల క్రితం అఖండ విజయం సాధించారు.

ధర్మపురి అభివృద్ధి శ్వాస ధ్యాసగా..

ధర్మపురి ప్రజలు అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించడంతో లక్ష్మణ్ కుమార్ అదే స్ఫూర్తితో నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నారు. ధర్మపురి అభివృద్ధి ధ్యాస శ్వాసగా పనిచేస్తున్నారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయిస్తున్నారు. అదేవిధంగా 2027 లో ధర్మపురి క్షేత్రంలో జరిగే గోదావరి పుష్కరాలకు నరసింహస్వామి క్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు నడుం బిగించారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ప్రత్యేకంగా మాట్లాడి నిధులు మంజూరు చేయించారు. గోదావరి పుష్కరాలను కనివిని ఎనగరని రీతిలో నిర్వహించేందుకు ఇప్పటినుంచి ఒక ప్రణాళిక ద్వారా పనులు చేపడుతున్నారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. గోదావరి పుష్కరాలతో ధర్మపురి క్షేత్రానికి దేశంలోనే మంచి గుర్తింపు రానుంది.నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు స్పందిస్తూ ముందుకు వెళుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నారు. తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల సాధకబాధకాల్లో పాలుపంచుకుంటున్నారు. రైతు సంక్షేమానికి పాటుపడుతున్నారు. నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తరచూ జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ అటు ధర్మపురి.. ఇటు జగిత్యాల జిల్లాను అన్ని రంగాల్లో ముందు ఉండేలా ప్రణాళికలు రచిస్తూ దిశా నిర్దేశం చేస్తున్నారు. అదేవిధంగా వివిధ ప్రాజెక్టు నిర్మాణాల్లో నిర్వాసితులైన వారి పక్షాన నిలుస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ప్రజలు ఆపదలో ఉంటే వెంటనే స్పందించి సహాయం అందిస్తున్నారు. వైద్య పరంగా ఇప్పటికే అనేక మందికి లక్షలాది రూపాయల సహాయం అందించారు అందిస్తూనే ఉన్నారు. నియోజకవర్గ ప్రజలు ఆపదలో ఉన్నట్టు తెలిస్తే వెంటనే కావలసిన సాయం అందజేస్తున్నారు. అదేవిధంగా విద్యాపరంగా ధర్మపురి నియోజకవర్గ మొదటి వరుసలో ఉంచేలా తన మార్కు చూపిస్తున్నారు.

తన శాఖ పై ప్రత్యేక మార్కు.

మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు తిరగకముందే తన శాఖపై పూర్తి పట్టు సాధించారు లక్ష్మణ్ కుమార్. ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ ద్వారా ఆ వర్గాలకు పూర్తిస్థాయిలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందేలా ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్నారు. అర్హులైన పేదవారికి ప్రభుత్వ పథకాలు అందేలా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ సంక్షేమ హాస్టల్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తరచూ వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ వాటిని గాడిలో పెడుతున్నారు. అధికారులు సిబ్బందిలో జవాబు దారి తనం పెంచేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. పేద విద్యార్థులు చదువుకునే సంక్షేమ హాస్టల్లో మెరుగైన వసతులు కల్పిస్తూ విద్య రంగంలో మరింత రాణించేలా మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. విద్యార్థులు విద్యుత్ తో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చూపుతున్నారు. ఇందుకు కారణం మంత్రి ప్రత్యేక చొరవే. రాబోయే రోజుల్లోనూ తన శాఖ ద్వారా మంత్రి లక్ష్మణ్ కుమార్ పేదలకు మరింత మెరుగైన సేవలందిస్తూ వారు అన్ని రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందేలా కృషి చేస్తారని ఆశిద్దాం.. కీప్ ఇట్ అప్ మంత్రి లక్ష్మణ్ కుమార్..

Latest