Mahaa Daily Exclusive

  మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆర్వీఆర్ సంస్థ కోటి రూపాయల వెండి మండప సమర్పణ – మంత్రి కొల్లు రవీంద్ర ప్రశంసలు

Share

కృష్ణాజిల్లా
అవనిగడ్డ నియోజకవర్గం

దిన దిన ప్రవర్ధమానంగా వెలుగొందుతున్న మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి మూల విరాటకు భారీ వెండి మండపాన్ని తయారు చేయించిన ఆర్ వి ఆర్ సంస్థ స్వామివారి పట్ల వారికి ఉన్న భక్తిని చాటి చెప్పిందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర కొనియాడారు.

శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రధాన గర్భాలయంలో స్వామివారి పాను పట్టంపై వెండిమండపం ప్రస్తుతం జీర్ణ దశకు చేరుకుంటుంది. గతంలో దర్శనార్థం వచ్చిన హైదరాబాద్ వాసి ఆర్ వి ఆర్ డిజిటల్ ఇన్ఫాస్ట్రక్చర్ లిమిటెడ్ అధినేత రావి వీర రాఘవ చౌదరి దృష్టికి విషయాన్ని పురోహితులు తీసుకువచ్చారు. కాగా స్వామివారి వైభోగానికి అద్దం పట్టేలా ఉండే వెండి మండపం తాను తయారు చేయిస్తానని హామీ ఇచ్చారు. దాదాపు 49 కిలోల వెండితో కోటి ఒక లక్ష యాబై మూడు వేలు విలువ గల వెండి మండపాన్ని తయారు చేయించి ఆలయ కార్యదర్శి దాసరి శ్రీరామ వరప్రసాదరావు సమక్షంలో వేదమంత్రోచ్ఛరణల నడుమ ఆర్ వి ఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు స్వామివారికి అలంకరించారు. వైభవంగా జరిగిన ఈ వేడుకకు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, రాష్ట్ర స్వచ్ఛంద్రా కమిషన్ చైర్మన్ పట్టాభి, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ద ప్రసాద్ అతిథులుగా హాజరై ప్రత్యేక పూజాలు, అభిషేకాలలో భాగస్వాములయ్యారు.

Latest