సిద్దిపేట, మహా
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడి ప్రకటన ప్రస్తుతం ఆ ప్రాంతంలో హాట్ టాపిక్‌గా మారింది. తన భార్యను వార్డు సభ్యురాలిగా గెలిపిస్తే, ఆ వార్డు ఓటర్లందరికీ ఐదేళ్లపాటు ఉచితంగా కటింగ్, షేవింగ్ చేస్తానని ఆయన సంచలన హామీ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే రఘోత్తంపల్లి గ్రామానికి చెందిన శివాని 6వ వార్డు సభ్యురాలిగా పోటీలో ఉన్నారు. ఆమె భర్త శ్రీకాంత్, వృత్తిరీత్యా నాయి బ్రాహ్మణ (మంగలి) కుటుంబానికి చెందిన వారు. తమ వార్డు అభివృద్ధికి నోచుకోలేదని, తమ వార్డుకు ఏదైనా చేయాలనే సంకల్పంతో తన భార్యను వార్డు మెంబర్‌గా పోటీలో నిలిపినట్లు శ్రీకాంత్ తెలిపారు. తమ వార్డు చాలా వెనకబడి ఉందని, తన భార్య శివానిని గెలిపిస్తే తప్పకుండా వార్డును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతోపాటు 5 సంవత్సరాల పాటు తమ వార్డులోని ప్రతి ఓటరుకు కటింగ్, షేవింగ్ ఉచితంగా చేస్తానన్నారు. దయచేసి తన భార్యకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.






