- కలెక్టరేట్లో అవినీతి అధికారిపై ఏసీబీ దాడులు
- శ్రీనివాస్ ఆదాయానికి మించిన ఆస్తులు.!
- రంగారెడ్డి కలెక్టరేట్ లో ఏసీబీ సోదాల కలకలం
ఎడి సర్వేయర్ శ్రీనివాస్ పై అక్రమాస్తుల ఆరోపణలు
ఏకకాలంలో ఆరు ప్రాంతాల్లో ఏసీబీ బృందాల దాడులు
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
శ్రీనివాసుపై అక్రమాస్తులు ఉన్నట్లు ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ అధికారులకు సోదాలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ఏడీ సర్వేయర్ శ్రీనివాస్ పై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ , రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో, ఏక కాలంలో ఆరు ప్రాంతాల్లో సోదాలు చేయడం జరిగింది. దీంతో కలెక్టరేట్ కార్యాలయంలో ఒకసారి కలకలం చెలరేగింది. క్షేత్ర స్థాయి అధికారులు మొదలుకొని, ఐఏఎస్ అధికారుల వరకు పట్టు పడుతుండటంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏడీ సర్వేయర్ శ్రీనివాస్ పై రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లోని ల్యాండ్ సర్వే కార్యాలయంలో సోదాలు కొనసాగుతుండగా, గచ్చిబౌలిలోని మైత్రి హోమ్స్, ఆయన ఇంటిపై సోదాలు చేపట్టారు. పెద్ద ఎత్తున అక్రమాస్తులు సంపాదించినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి.
అక్రమ కంపెనీలతో వ్యాపారాలు…
పలుచోట్ల షెల్ కంపెనీల పేరుతో వ్యాపారాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంతో పాటు రాయ్ దుర్గం, మై హోమ్ బుజాలో సోదాలు కొనసాగించారు. రంగారెడ్డి కలెక్టర్ లో ఏసీబీ దాడులు కొనసాగడం ఇది రెండవసారి. 2024 ఆగస్టు మాసంలో అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి పై సైతం ఎసీబీ దాడులు జరిగాయి. ఎడి సర్వేయర్ శ్రీనివాస్ పై అక్రమ ఆస్తులు ఉన్నాయని ఆరోపణలతో ఏకకాలంలో ఆరు ప్రాంతాల్లో దాడులు కొనసాగాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






