- జోగురామన్న.. నీ రాసలీలల సీడీ పార్సిల్ పంపాలా?
- బిజెపి ఎమ్మెల్యే పాయల్ శంకర్ సంచలన కామెంట్స్
- కేసీఆర్, సంతోష్ దగ్గర నీ సీడీలు ఉన్న విషయం మరిచిపోయావా?
ఆదిలాబాద్, మహా
జోగురామన్న.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నీవు మంత్రిగా చేసిన బ్రోకరిజం, అక్రమసంబంధాలు రాసలీలల ఆధారాలు ఇంటెలిజెన్స్ వద్ద ఉన్నాయని, కావాలంటే ఆ రాసలీలల సీడీలు తీసుకుని పంపిస్తానని బీజేపీ శాసనసభపక్ష ఉపనేత, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సంచలన కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగురామన్నపై పాయల్ శంకర్ సంచలన కామెంట్స్ చేశారు. ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర, రాజ్యసభ సభ్యులుగా ఉన్న సంతోఫ్ రావు దగ్గర నీ సీడీలు ఉన్న విషయం మరిచిపోయినవా? ఆనాడు ఉన్న ఇంటెలిజెన్స్ ఆపీసర్లే ఈనాడు ఉన్నరు. నేను మర్యాదగా మాట్లాడుతున్న.. కావాలంటే సీడీలు పార్శిల్ పంపుతా. నువ్వు ఎంతయితే మాట్లాడుతవో.. అంతకంటే ఎక్కువ మాట్లాడుతానంటూ ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఒక ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి వచ్చినపుడు స్థానిక శాసనసభ్యుడిగా గౌరవించి ఆహ్వానించడం సంప్రదాయమన్నారు. ఆదిలాబాద్ ప్రజల సమక్షంలో నిధులు ఇవ్వమని గౌరవ ముఖ్యమంత్రిని కోరానని, ట్రైబల్ యూనివర్శిటీ కేసీఆర్ హయాంలో ములుగుకు తరలిపోయినా జోగురామన్న నోరుమెదపలేదన్నారు.
……






