Mahaa Daily Exclusive

  కేసీఆర్, కేటీఆర్‌లను ఎందుకు జైల్లో వేయడం లేదు?

Share

  • కేసీఆర్, కేటీఆర్‌లను ఎందుకు జైల్లో వేయడం లేదు?
  • మండిపడ్డ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్
  • సీఎం రేవంత్ రెండేళ్ళపాలనపై ఛార్జిషీట్

ఢిల్లీ, మహా : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఛార్జ్‌షీట్ విడుదల చేశారు. ఆదివారం ఢిల్లీ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడారు. రెండేళ్లు పూర్తి చేసుకున్నందుకు కాంగ్రెస్, రేవంత్‌రెడ్డికి కంగ్రాట్యులేషన్స్ తెలిపారు. కేసీఆర్, కేటీఆర్‌లను ఎందుకు జైల్లో వేయడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రజా వంచన చేసిందని ఆక్షేపించారు. ఇచ్చిన ఒక్క హామీని కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. హిందూ దేవుళ్లపై రేవంత్‌రెడ్డికి ఎందుకంత కోపమని నిలదీశారు. కాంగ్రెస్ అంటే ముస్లింలని రేవంత్‌రెడ్డి అన్నారని ఆరోపించారు. తెలంగాణలో 793 మంది రైతులు రెండు సంవత్సరాల్లో ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ నేతల మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. తాము అంతా ఒక్కటేనని.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావుకు, తనకు మంచి సన్నిహితం ఉందని వివరించారు. రామచంద్రరావు తనకు పెద్దన్న లాంటి వారని, ఆయన అధ్యక్షతన రాష్ట్రంలో పార్టీ బలపడుతోందని ఆకాంక్షించారు.
……

Latest