Mahaa Daily Exclusive

  యూపీలో అధికారంలోకి వచ్చేది మేమే:యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్

Share

  • యూపీలో అధికారంలోకి వచ్చేది మేమే
  • ఏపీ సపోర్ట్ లేకపోతే కేంద్రంలో బీజేపీ ఉండేది కాదు
  • పార్టీలు వేరైనా మనమంతా ఒక్కటే
  • యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్

హైదరాబాద్, మహా : రాబోయే ఎన్నికల్లో యూపీలో అధికారంలోకి వచ్చేది తామేనని, యోగీ ప్రభుత్వాన్ని క్రమక్రమంగా వెనక్కి నెట్టేస్తున్నామని సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ అన్నారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జరిగిన సదర్ సమ్మేళనం ఉత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ మద్దతు లేకపోయి ఉంటే, కేంద్రంలో బీజేపీ కూటమి తిరిగి అధికారంలోకి వచ్చేదే కాదన్నారు. యోగీ చరిషఅమా తగ్గిందని, యూపీ ప్రజలు కూడా వాస్తవాలను గ్రహించారన్నారు. ఇప్పుడిప్పుడే ప్రజలు సమాజ్వాది పార్టీ వైపు చూస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ఆ ఫలితం తప్పకుండా కనిపిస్తుందన్నారు. “మనం వేర్వేరు రాజకీయ పార్టీల్లో ఉండొచ్చు, కానీ మనమంతా ఒక్కటే. ఇవాళ మనం ఇక్కడ రాజకీయాలకు అతీతంగా కలుసుకున్నాం” అని అన్నారు. భవిష్యత్తులో ఈ ఉత్సవాన్ని మరింత గొప్పగా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని తాము వెనక్కి నెడుతున్నామని, రాబోయే ఎన్నికల్లో అక్కడ మళ్లీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు.