- కెసిఆర్ హాయంలోనే గ్రామీణ పల్లెలు అభివృద్ధి
- *రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధికి ఆమడ దూరంలో గ్రామాలు
- *6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వ పాలనకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలి
*గ్రామపంచాయతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బిఆర్ఎస్ మండల పార్టీ పిలుపు
మహా కోదాడ
పది సంవత్సరాల కెసిఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రంలోని గ్రామపంచాయతీలలో గణనీయమైన అభివృద్ధి సాధించి గ్రామ స్వరాజ్యం వెళ్లివిరిసిందని, 60 ఏళ్లలో జరగని అభివృద్ధి పదేళ్ల కేసీఆర్ పాలనలో జరిగిందని, గ్రామీణపల్లెలు, తాండాలు, గూడాలు మహానగరాల వరకు అన్ని రంగాలలో కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధిని పరుగులు పెట్టించిందని మునగాల మండల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సుంకర అజయ్ కుమార్, మండల అధ్యక్షుడు తొగరు రమేష్ అన్నారు, శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక పార్టీ కార్యాలయంలో మునగాల గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి వేట. నాగలక్ష్మి శివాజీ దంపతులతో పాటు, పార్టీమండల నాయకులతో కలిసి పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత శాసనసభ ఎన్నికల సందర్భంగా 6 గ్యారెంటీలు, 420 హామీలతో ప్రజల్ని నమ్మించి మోసంచేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సారధ్యంలోని రేవంత్ ప్రభుత్వం నేటి వరకు ఏఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేసిందని, గ్రామీణ పల్లెల్లో గత రెండు సంవత్సరాలుగా పరిపాలన స్తంభించి పల్లెల్లో అభివృద్ధి పడకేసిందని, కనీసం డ్రైనేజీ గుంటల్లో, మురుకు కాలవల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లే నాధుడు లేక ,వీధిలైట్లు పారిశుద్ధ్య చర్యలు మంచినీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల కల్పన లేక పల్లె జనం అల్లాడుతున్నారని, నాటి పదేండ్ల పాలనలో కెసిఆర్ తండాలను సైతం గ్రామపంచాయతీగా తీర్చిదిద్ది, ప్రతి చిన్న గ్రామపంచాయతీ నుండి మేజర్ గ్రామపంచాయతీల వరకు ఇంటింటికి చెత్త బుట్టలు పంచి, వీధుల్లో చెత్తాచెదారం ఇతర వ్యర్ధాలను ఎత్తేందుకు ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్ అందించి, నిరంతరం గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపడుతూ పల్లెల్ని పరిశుభ్రంగా ఉంచారని, ప్రతి వీధిలో వీధిలైట్లు నిరంతరం మురుగునీటి కాలువలో బ్లీచింగ్ పౌడర్ చల్లించడం, ప్రతి గ్రామానికి వన నర్సరీ, పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాగణం ఏర్పాటు, క్లస్టర్ల వారీగా రైతుల కోసం రైతు వేదికల ఏర్పాటు, పచ్చదనం పెంచేందుకు వనమహోత్సవంలో చెట్లు నాటడం, గ్రామంలోని రోడ్లన్నీ సీసీ రోడ్డు గా మార్చడం, డ్రైనేజీ కాలువల నిర్మాణం, ఇంటింటికి మిషన్ భగీరథ మంచినీరు పంపిణీ, మిషన్ కాకతీయ పథకంతో చెరువుల్లో మట్టి తొలగించి చెరువు నీటిసామర్థ్యం పెంచడం, ఇలా అనేక సంక్షేమ పథకాలతో గ్రామ స్వరాజ్యం దిశగా పల్లెలు అభివృద్ధి దిశలో ముందుకుసాగుతూ దేశస్థాయిలో ఎన్నో విశిష్టమైన అవార్డులు అందుకొని దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూసేలా మన బాపు కెసిఆర్ పరిపాలన ఉన్నదని, కావున ప్రజలందరూ మరొకసారి నాటి కేసిఆర్ ప్రజారంజక పరిపాలనకు మద్దతు తెలుపుతూ, ప్రస్తుత గ్రామపంచాయతీ ఎన్నికల్లో మండలంలోని 22 గ్రామపంచాయతీల పరిధిలో సర్పంచ్ మరియు వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న స్థానిక బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మరియు బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో వారిని గెలిపించాలని వారు ఈ సందర్భంగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు, ఈ కార్యక్రమంలో మునగాల పిఎసిఎస్ చైర్మన్ కంది బండ సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు ఉడుం కృష్ణ, ఎల్.పి.రామయ్య,
తదితరులు పాల్గొన్నారు.








