ఆదిలాబాద్ మహా : బేల మండలంలోని కొబ్బయి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా గెలిచిన సర్పంచ్ టేకం సత్యపాల్ కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆకర్షితులై, కొబ్బయి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వైద్య నానాజీ పాటిల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ గూటికి చేరారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ రావు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. గ్రామ పంచాయితీల అభివృద్ధి కోసం ఆయా గ్రామాలలో గెలిచిన ఇండిపెండెట్లు అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆయన ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి ,ఆశన్న, కొండూరి రవి ,మాడవి జనార్దన్, కయ్యుమ్, ప్రమోద్, వికాస్, ప్రశాంత్, వందన ,అశోక్ ఈశ్వర్ ,మన్సూర్ అహ్మద్ , మోరేశ్వర్, శంకర్ ,రోషన్ తదితరులు పాల్గొన్నారు.








