Mahaa Daily Exclusive

  ‘టీటీఏ’ సంస్థ‌ కృత్రిమ అవయవాల పంపిణీ… కొన‌సాగుతున్న ‘టీటీఏ’ సేవా డేస్‌ 2025..

Share

హైద‌రాబాద్: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ‘టీటీఏ సేవా డేస్‌ 2025’లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల‌లో సేవ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది. ఈ క్ర‌మంలో తాజాగా హయత్‌నగర్‌లోని పొదార్ ఇంటర్నేషనల్ స్కూల్ వేదికగా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ఆధ్వర్యంలో ‘TTA సేవా డేస్‌ 2025’ కార్యక్రమాన్ని నిర్వ‌హించింది. ఈ కార్యక్రమంలో శారీరక వైకల్యం ఉన్న అవసరమైన వారికి కృత్రిమ అవయవాలు, ట్రైసైకిళ్లు, వీల్‌చైర్లు పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు హాజరై ఈ సేవా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

ఈ సేవా కార్యక్రమాన్ని టీటీఏ అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెద్ది, టీటీఏ మెగా కన్వెన్షన్ కన్వీనర్ ప్రవీణ్ రెడ్డి చింతారెడ్డి, రమేశ్ రెడ్డి దేవరం, యూత్ కమిటీ చైర్ ప్రణవి మల్లిపెద్ది ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించారు.

ఈ సందర్భంగా టీటీఏ అధ్యక్షుడు నవీన్ మల్లిపెద్ది మాట్లాడుతూ.. టీటీఏ వ్యవస్థాపకుడు డా. పైళ్ల మల్లారెడ్డి, ఏసీ చైర్ డా. విజయపాల్ రెడ్డి, ఏసీ కో-చైర్ డా. మోహన్ రెడ్డి పటలోళ్ల, ఏసీ సభ్యులు భరత్ రెడ్డి మడాది, శ్రీని అనుగు, మాజీ అధ్య‌క్షుడు వంశీ రెడ్డి కంచర్కుంట్ల, సేవా డేస్ కోఆర్డినేటర్ విశ్వ కందితో పాటు కార్యక్రమానికి హాజరై పూర్తి సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. లబ్ధిదారుల ముఖాల్లో కనిపించిన ఆనందం, కృతజ్ఞత భావం టీటీఏ సభ్యులు, వాలంటీర్లకు మ‌రిన్నో సేవ‌లు చేయాల‌నే త‌ప‌న క‌లిగించింద‌ని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సేవ, క‌రుణ‌, సామాజిక అభివృద్ధి అనే టీటీఏ లక్ష్యాలను మరింత బలోపేతం చేస్తున్నాయని పేర్కొన్నారు.

ఇలాంటి సేవ కార్యక్రమాలకు ప్ర‌తి ఒక్క‌రూ మద్దతు ఇవ్వాలని, టీటీఏలో భాగస్వాములై ఆశ, సంరక్షణ, సాధికారతను తెలంగాణ సమాజమంతటా విస్తరించేందుకు ముందుకు రావాలని టీటీఏ నాయ‌కులు పిలుపునిచ్చారు.