Mahaa Daily Exclusive

  తెలంగాణ లో జనసేన…. పవన్ కల్యాణ్ మాస్టర్ స్కెచ్…

Share

  • తెలంగాణ లో జనసేన
  • పవన్ కల్యాణ్ మాస్టర్ స్కెచ్
  • నేడు పది జిల్లాల నేతల కీలక భేటీ

హైదరాబాద్, మహా : తెలంగాణలో జనసేన పార్టీని విస్తృతస్థాయిలో తీసుకువెళ్లాలని సూచించిన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ఈనెల 18వ తేదీన కీలక సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణలోని ఉమ్మడి10 జిల్లాల పార్టీ శ్రేణులు మరియు గ్రేటర్ హైదరాబాద్ పార్టీ శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గం ఇన్చార్జిలు, పీఓసీ సభ్యులు, వివిధ పదవులల్లో ఉన్న నాయకులు, వీర మహిళలు, క్రియాశీలక వాలంటీర్లు వారి వారి నియోజకవర్గాల నుండి పార్టీ శ్రేణులు అందరూ పాల్గొనేలా బాధ్యత తీసుకొని ఈ విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర నాయకత్వం ప్రకటన విడుదల చేసింది. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో సర్పంచులుగా, వార్డ్ మెంబర్లుగా జనసేన పార్టీ తరపున పోటీచేసి విజయం సాధించి ఈ సమావేశంలో సన్మానించనున్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన అభ్యర్థులు ఈ సమావేశంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచనలు చేశారు. ఆశావహులు అందరూ పాల్గొనాలని పేర్కొన్నారు.