- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
- నిందితులందరినీ మరోసారి విచారించిన సిట్ అధికారులు
- ముగిసిన ప్రభాకర్ రావు కస్టడీ
హైదరాబాద్, మహా : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులందరినీ సిట్ అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. ప్రణిత్రావు, భుజంగరావు, రాధాకిషన్‌రావు, తిరుపతన్నలను పిలిచిన సిట్ వారిని విచారించారు. నేటితో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ముగియనుండటంతో అందిరితో కలిపి దర్యాప్తు చేస్తోంది సిట్. అందులోభాగంగా ఇప్పటికే సిట్ అధికారి రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా సిట్ ఆఫీసుకు చేరుకున్నారు. నేటితో ప్రభాకర్ రావు 14 రోజుల విచారణ ముగియనుండగా ఉదయం 10 గంటలకు పోలీస్ కస్టడీ నుంచి విడుదల కానున్నారు. అయితే 14 రోజుల కస్టడీలో ప్రభాకర్‌రావు ఏం చెప్పారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి అనేక ప్రశ్నలకు ఎస్ఐబీ మాజీ చీఫ్ సమాధానం చెప్పనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి పెన్ డ్రైవ్‌ను సిట్ అధికారులు కీలక ఆధారంగా భావించారు. ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్‌గా పని చేసిన కాలంలో పెన్ డ్రైవ్‌లో ట్యాపింగ్ వివరాలు స్టోర్ చేసినట్లు సిట్ గుర్తించింది. ఈ పెన్ డ్రైవ్ డేటాను ప్రభాకర్ రావు ముందు పెట్టి సిట్ విచారించింది. అయితే 6 వేల ఫోన్ నెంబర్లు ఉన్నప్పటికీ పెన్‌డ్రైవ్‌పై ప్రభాకర్ రావు ఎలాంటి జవాబు ఇచ్చారన్నది అస్పష్టంగా ఉంది. మరో వైపు ప్రభాకర్ రావు సమాచారం అధారంగా త్వరలోనే హరీష్ రావుతో పాటు మాజీ సీఎం కేసీఆర్ కు కూడా నోటీసులు ఇచ్చి విచారించేందుకు సిట్ సన్నద్దమవుతున్నట్లు సమాచారం.








