Mahaa Daily Exclusive

  200 ఏళ్లు చెక్కుచెదరకుండా మేడారం ఆలయ పునరుద్ధరణ: చారిత్రక రీతిలో జాతర ఏర్పాట్లు – మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

Share

  • కని విని ఎరుగని రీతిలో మేడారం జాతర నిర్వహణ
  • 200 ఏళ్ళు చెక్కు చెదరకుండా పునరుద్దరణ పనులు
  • ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్దతోనే సాకారమవుతున్న అద్భుతం
  • రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ఆదివాసీ బీజాల సుందర శిల్పాలతో మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణం గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు శాశ్వత చిరునామగా నిలుస్తుందని, చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో ప్రజా ప్రభుత్వం మేడారం జాతరను నిర్వహించడానికి సంకల్పించుకుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.
ఆదివారం ములుగు జిల్లా . తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయంనకు హెలికాప్టర్ లో చేరుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ లతో కలిసి ఆలయ ప్రాంగణ ల్యాండ్ స్కేపింగ్ పనులను, ప్రధాన ఆర్చి నిర్మాణ పనులు, హరిత హోటల్ జంక్షన్ సుందరీకరణ, రహదారి నిర్మాణ పనులను, జంపన్న వాగు స్నాన ఘట్టాలను, లెవెలింగ్ పనులను , నీటి నిల్వ కోసం ఏర్పాటు చేస్తున్న ఆనకట్టల నిర్మాణ పనులను పరిశీలించారు. జంపన్న వాగు వద్ద ఏర్పాటు చేసిన ఇందిరా మహిళ శక్తి బ్యాంబు చికెన్ క్యాంటీన్ ను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మంత్రి దనసరి అనసూయ సీతక్క, కలెక్టర్ దివాకర టి.ఎస్ లతో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రులు ఎం పి బలరాం నాయక్ తో కలిసి మేడారంలోని హరిత హోటల్ లో సంబంధిత శాఖల ఉన్నత స్థాయి అధికారులతో, గుత్తేదారులతో మేడారం జాతర అభివృద్ధి పనుల పురోగతి పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

జనవరి 12 కల్లా పూర్తిచేయండి

ఆలయ ప్రాకారం పిటి బీమ్స్ అమరిక పనులను, గద్దెల రాతి స్తంభాలపై బ్రాకెట్ లను త్వరిత గతిన ఏర్పాటు చేయాలని, ఆలయ ప్రాంగణ మరియు జాతర సివిల్ వర్క్స్, క్యూ లైన్స్ షేడ్స్ నిర్మాణం మొత్తం జనవరి 12వ తేది వరకు పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. నూతనంగా నిర్మించిన రహదారులకు ఇరువైపులా సైడ్ బర్ములను ఏర్పాటు చేయాలని పబ్లిక్ స్థలాలను ప్రైవేట్ వ్యక్తులు దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి చూస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మేడారం జాతర చుట్టూ ప్రక్కల ఎక్కడ కూడా త్రాగునీటి సమస్య రాకుండా బోర్ వెల్స్ చేతి పంపులు ఏర్పాటు చేయాలని, మేడారం ప్రాంతం సంక్రాంతి పండుగ ముందు నుంచి జనవరి 31 వరకు విద్యుత్ కాంతుల వెలుగులతో భక్తులకు కనిపించాలని వాటికోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబధిత అధికారులకు సూచించారు. జాతర పరిసరాలను జోన్స్, సెక్టార్స్ వారిగా సిబ్బందిని ఏర్పాటు చేసుకొని పారిశుధ్య పనులను చేపట్టాలని , పనుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులు ఐనా గుత్తేదారులకు ఐనా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈనెల 20వ తేదీలోగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకరోజు ముందే ఇక్కడికి వచ్చి రాత్రి బస చేసి తెల్లవారి ఉదయం ఆలయ పునరుద్ధరణ పనులు పూర్తయిన సందర్భంగా ప్రారంభించుకునే కార్యక్రమం చేపట్టబోతున్నాం అని తెలిపారు. సమ్మక్క సారలమ్మ భక్తులు సంతోషపడే విధంగా శుభవార్తగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం జాతరను పురస్కరించుకొని ప్రతి జాతరకు వచ్చే దాని కంటే కూడా తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని రాష్ట్రాలకు చెందిన కోట్లాదిమంది భక్తులు సమ్మక్క సారలమ్మ జాతరకు విచ్చేస్తున్నారని, దానికి తగ్గట్టుగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

సీఎం ఆదేశాలతో
సమ్మక్క సారలమ్మ జాతరలో మౌలిక వసతులతో పాటు అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని పేర్కొన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఇక్కడే ఉండి పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. ఆలయ పునరుద్ధరణ పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసే విధంగా కృషి చేస్తున్నారు. అమ్మవార్ల దయతో ఆలయ పునరుద్ధరణ పనుల కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఛాలెంజ్ గా తీసుకొని చేపట్టిందని, తక్కువ సమయంలో రాతితో 200 సంవత్సరాల వరకు చెక్కుచెదరకుండా ఉండే విధంగా ఆలయ పునరుద్ధరణ పనులు చేపట్టాం అని స్పష్టం చేశారు.

Latest