- సంక్రాంతి రద్దీ
- ఎక్కడి వాహనాలు అక్కడ జామ్
- హైదరాబాద్ – విజయవాడ హైవే కిటకిట
హైదరాబాద్, మహా : సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లేవారితో హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. శనివారం ఉదయం హైవేపై దారి పొడవునా వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. మరోవైపు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవాలని.. గుంటూరు, ఒంగోలు వైపు వెళ్లేవారు సాగర్ హైవే మీదుగా వెళ్లాలని సూచించారు. సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో ఎంజీబీఎస్, జేబీఎస్లో రద్దీ పెరిగింది. దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, తార్నాక కూడళ్లు సందడిగా మారాయి. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. మరోవైపు రైల్వేస్టేషన్లలో కూడా రద్దీ పెరిగింది.
Post Views: 9








