Mahaa Daily Exclusive

  ఓ మంత్రి మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు ఎప్పుడు

Share

  • గెలిసి రెండు సంవత్సరాలు పూర్తయింది… ఆర్టీసీ బస్టాండ్ సులబ్ కాంప్లెక్స్ ఎప్పుడు పూర్తవుతుంది
  • మాజీ ఎమ్మెల్యే సుమన్ నిధులు పట్టుకొస్తే… మీరు ఇతర పనులకు మళ్లిస్తున్నారు
  • చెన్నూరు ఎమ్మెల్యే, కార్మిక శాఖ మంత్రికి బీఆర్ఎస్ ప్రశ్నల వర్షం

మందమర్రి, మహా : ఓ చెన్నూరు ఎమ్మెల్యే, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేకానంద మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు ఎప్పుడు జరిపిస్తారని భారత రాష్ట్ర సమితి మందమర్రి పట్టణ అధ్యక్షులు జంగిలి రవీందర్, సెక్రటరీ జనరల్ బండారి సూరిబాబులు ప్రశ్నించారు. మంగళవారం స్థానిక టీబీజీకేఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, కార్మిక శాఖమంత్రి వివేక్ వెంకటస్వామి అసెంబ్లీ ఎన్నికలలో సమయంలో మందమర్రి ఏజెన్సీ ప్రాంతాన్ని మున్సిపాలిటీగా మారుస్తామని ఇచ్చిన హామీని ఇప్పటివరకు ఎన్నికలు జరిపించకపోవడం సిగ్గుచేటు అని ఎద్దేవ చేశారు. అలాగే మందమర్రి పట్టణ అభివృద్ధి పనులు చేయడంలో కూడ పూర్తిగా విఫలం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ధ్వజమెత్తారు. మందమర్రి మార్కెట్ టిఎస్ఆర్టిసి బస్టాండ్ ఆవరణలో ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే సులబ్ కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేసిన ఇప్పటివరకు కూడా పూర్తి కాకపోవడం మంత్రి పనితనానికి నిదర్శనమని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మందమర్రి మున్సిపాలిటి అభివృద్ధికి కోట్ల రూపాయలు నిధులు తీసుక వచ్చి అభివృద్ధి పనులు చేపట్టారని వెల్లడించారు. అందులో సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణానికి -9.50 కోట్లు, కేసిఆర్ పార్క్ -3.50 కోట్లు, హిందూ స్మశాన వాటికకు- 2.00, కోట్లు,యాపల్ ప్రాంత హిందు స్మశాన వాటిక -1.60 కోట్లు, క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్- 30 లక్షలు, ముస్లిం గ్రేవ్ యార్డు- 30 లక్షలు, పట్టణంలోని ప్రధాన రోడ్లు పోస్ట్ ఆఫీస్ నుండి పాల చెట్టు ఏరియా వరకు రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్ కొరకు -2.00 కోట్లు, అంబేద్కర్ స్కిల్ సెంటర్ కొరకు -5.00 కోట్లు, మందమర్రి పాత బస్టాండ్ ఏరియాలోని దోబీ ఘాట్ కొరకు – 2.00 రూపాయలు విడుదల చేశారని పేర్కొన్నారు. ఈ పనులను పూర్తి చేయకపొగ ఈ అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులను రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తూ తాను నిధులు తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో మందమర్రి టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు మేడిపల్లి సంపత్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ బడికల సంపత్, మద్ది శంకర్, కొంగల తిరుపతిరెడ్డి, బోరిగం వెంకటేష్, మేడిపల్లి మల్లేష్, భూపెల్లి కనకయ్య,పల్లె నర్సింగ్, వీరరెడ్డీ, నల్వాల సమ్మయ్య, బట్టు రాజ్ కుమార్, తోట సురేందర్, ముస్తఫా, బెల్లం అశోక్, దాసరి నవీన్,రవి నాయక్, మొగురం శ్రీనివాస్, రాకేష్, పోషం, రవి వర్మ, పవయ్య ,శేఖర్ యాదవ్, వేణుగోపాల్, సంగర్తి సంతోష్ , కొండం శ్రీను,ముల్కల రమేష్, మోహన్ ,బెల్లం అరుణ్, మొగిలి అజయ్,సీపెల్లి సాగర్, పాల్గొన్నారు.

Latest