హైదరాబాద్ :సచివాలయం లో గురువారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన శాఖ లోని వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్ ల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఇతర పాలన వ్యవహారాల పై అధికారులతో,కార్పొరేషన్ చైర్మన్ల తో సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ట త్మకముగ వ్యవసాయ రంగం కు అధిక నిధులు కెటాయిస్తుందని అందుకు అనుగుణంగా వార్షిక ప్రణాళిక లు ఏర్పాటు చేసుకొని రైతులకు మేలు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ శ్రీ జంగా రాఘవ రెడ్డి,రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు
Post Views: 11








