Mahaa Daily Exclusive

  మునిసిపాలిటీలలో బీసీలు సత్తా చాటాలి :టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

Share

  • బీసీ పక్షపాతి కాంగ్రెస్ పార్టీ
  • రాష్ట్ర చరిత్రలో బీసీలకు మేలు చేసింది ప్రజా ప్రభుత్వం
  • బీసీల అభ్యున్నతి కోసం అప్పటికే రెండు బిల్లులు తెచ్చాం
  • మరో మూడు బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నా.యి
  • మునిసిపాలిటీలలో బీసీలు సత్తా చాటాలి
  • టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్, మహా : రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధఁగా ప్రస్తుత ప్రజా ప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఓబీసీ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్టేట్ ఎకస్ టెండెడ్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో మాట్లాడుతూ, బీసీ ముఖ్యమంత్రి అయ్యే టైంలో అవుతారంటూ మున్ముందు బీసీలకు చాలా అవకాశాలు వస్తాయని తెలిపారు. అవకాశం ఉన్న ప్రతీ చోట బీసీలకు పదవులు ఇస్తూ వెళ్తున్నామని చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం అనంతరం కుల సర్వే నిర్వహించిన ఘనత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు.కుల సర్వే ద్వారా బీసీలము 56 శాతం ఉన్నామని అఫిషియల్ డాక్యుమెంట్ ఇచ్చామన్నారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి పూర్తి చిత్తశుద్ధి ఉందని, అందుకే రెండు చట్టాలను తీసుకు రావడం జరిగిందన్నారు. మరో మూడు బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయన్నారు. కష్టపడి పనిచేస్తే ఎవరి వాటా వాళ్లకు వస్తుందని.. దీనిని ఎవరూ ఆపలేరని అన్నారు. రాబోయే రోజులు అన్నీ బీసీలవే అని కీలక వ్యాఖ్యలు చేశారు. 2029 లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, * రాహుల్ గాంధీ ప్రధాని కావడం తథ్యమని, రాహుల్ గాంధీ హయంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల చట్ట బద్దత తెచ్చుకుంటామన్న విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. దేవుళ్ల పేరిట రాజకీయాలు దేశానికి మంచిది కాదని, కులం, మతం అనేవి మన పిల్లలకు భవిష్యత్తును తీసుకురావని మహేశ్ గౌడ్ అన్నారు. రాముడు, అంజనేయుడి పేరు చెప్పి బీజేపీ వాళ్లు ఓట్లు దండుకుంటున్నారని విమర్శించారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ జై శ్రీరాం అని అనకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడగాలన్నారు. ఆయన రాముని పేరు చెప్పడం తప్ప నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్​ జెండా ఎగుర వేస్తామన్నారు. దేవుళ్లతో రాజకీయాలను ముడి పెట్టవద్దని అన్నారు.