Mahaa Daily Exclusive

  ఏఐ లేబులింగ్ విధానం అవసరం: జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు

Share

మహా
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సృష్టించిన కంటెంట్‌ను గుర్తించేలా లేబులింగ్ విధానాన్ని తీసుకురావాలన్న కేంద్రం నిర్ణయాన్ని ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం, జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు స్వాగతించారు. కేంద్రం నిర్ణయం సరైందని, నియంత్రణ నిబంధనలు అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. మార్ఫింగ్ ఫొటోలు, నకిలీ సమాచారం సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల డీప్‌ఫేక్స్, ఏఐ సాయంతో సృష్టించిన మార్ఫింగ్ ఫొటోలతో ప్రముఖులు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన శ్రీధర్ వెంబు, వ్యక్తుల గోప్యతకు భంగం కలిగించే ఏ అంశమైనా అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. మార్ఫింగ్ చిత్రాల వల్ల కలిగే నష్టాన్ని నివారించడానికి ఈ నిబంధనలు అవసరమన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి తాను పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.