Mahaa Daily Exclusive

  “కూతురే కొడుకు అయిన వేళ” 

Share

ఘనంగా తండ్రి అంత్యక్రియలు నిర్వహించిన చింతల భారతి…

 

చర్ల మహా

ఓ కూతురే తన తండ్రికి కొడుకై తలకొరివి పెట్టంది….ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలోని పాత చర్ల అంబేద్కర్ నగర్ లో జరిగింది…ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి అంబేద్కర్ నగర్ గ్రామానికి చెందిన చింతల రాంబాబు కమల కుమారి దంపతులకు ఒక కుమార్తె భారతి.‌ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రి అయిన చింతల రాంబాబు తీవ్ర అస్వస్థకు గురై 28వ తారీఖున నాడు చికిత్స పొందుతూ భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మరణించినారు కుమారుడు లేని తన ఇంటిలో సంప్రదాయపరంగా కొరివి పెట్టాల్సిన బాధ్యత పెద్ద కుమార్తె భారతి తీసుకొని తన తండ్రికి ఘనంగా భారీ జన సందోహంతో ఊరేగింపుతో అంత్యక్రియలు నిర్వహించి కన్నతండ్రి రుణం తీర్చుకుంది ఈ సంఘటన చూసిన చర్ల మండల అంబేద్కర్ నగర్ గ్రామప్రజలు కంటే కూతుర్నే కనాలి అంటూ అభినందిస్తున్నారు….