- బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ హస్తగతం
- బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్గా దావా స్వాతి రమేష్
- మున్సిపల్ వైస్ చైర్మన్ గా రాగం శెట్టి సత్యనారాయణ
- ప్రమాణస్వీకారం చేయించిన మున్సిపల్ ప్రత్యేక అధికారి &బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్
బెల్లంపల్లి, మహా: బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ హస్తగతమైంది.
నాటకీయపరిణామాల మధ్యఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రత్యేక వ్యూహారచనతో మున్సిపల్ చైర్మన్ తోపాటు వైస్ చైర్మ
న్ ల పదవులు కాంగ్రెస్ ఖాతాలోకి చేరిపోయాయి. సోమవారం నాడు బెల్లంపల్లి స్పెషల్ ఆఫీసర్ సబ్ కలెక్టర్ మనోజ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలోని ప్రత్యేక సమావేశం మందిరంలో ఓటింగ్ ప్రక్రియను నిర్వ
హించారు ఈ ప్రక్రియకు కాంగ్రెస్ పార్టీకి చెందిన 14 మంది వార్డుసభ్యులతో పాటు ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు ఒక బీజేపీ వార్డు మెంబర్ మరియు బెల్లంపల్లి స్థానిక ఎమ్మెల్యే & మున్సి
పల్ ఎక్స్ అఫీషియో మెంబర్ గడ్డం వినోద్ సైతం ఓటింగ్ ప్రక్రియలో సోమవారం నాడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ తొలిత వార్డు సభ్యులతో ప్రమాణస్వీకారం మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ పదవికి దావ స్వాతి రమేష్ నిలబడగా హాజరైన 20 మంది సభ్యులతో పాటు వార్డు మెంబర్ ఎక్సాఫీస్ మెంబర్గా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే సైతం చేతులెత్తి తమ మద్ద
తును ప్రకటించారు దీంతో మున్సిపల్ చైర్మన్ పదవి ఎన్నికైన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మున్సిపల్ ప్రత్యేక అధికా
రి మనోజ్ వెల్లడించారు అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ పదవికి రాగం శెట్టి సత్యనారాయణ నిలబడగా ఆయనను సైతం కాంగ్రెస్ పార్టీ సభ్యు
లతో పాటు ఐదుగురు స్వతంత్ర అభ్య
ర్థులు బిజెపి వార్డ్ మెంబర్ ఎక్స్అఫీసి
యో మెఃబర్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ సైతం చేతులు ఎత్తి మద్దతును ప్రక
టించారు.దీంతో వైస్ చైర్మన్ పదవి సైతం ఎన్నికైనట్లు మున్సిపల్ ప్రత్యేక అధికారి ప్రకటించారు అనంతరం మున్సిపల్ చైర్మన్ తో పాటు వైస్ చైర్మ
న్గా ఎంపికైన అభ్యర్థులతో ప్రమాణ స్వీకార ప్రక్రియను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి టిఆర్ఎస్ పార్టీకి చెంది
న వార్డు సభ్యులు 14 మంది గైర్హాజర
య్యారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుం
డా బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ ప్రత్యే
కంగా బందోబస్తు నిర్వహించారు.








