- ఆదిలాబాద్ మునిసిసిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం
- ఛైర్ పర్సన్ గా బండారి అనూష సతీష్, వైస్ చైర్మన్ గా మహ్మద్ రోహిత్
- డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ తో కలిసి చక్రం తిప్పిన కంది శ్రీనివాసరెడ్డి
- కందికి మంత్రి జూపల్లి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అభినందనలు
- ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం
ఆదిలాబాద్, మహా
ఆదిలాబాద్ మునిసిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగిరింది. కాంగ్రెస్ పార్టీ ఇతరుల మద్దతుతో మునిసిపాలిటీని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ రెబెల్ అభ్యర్ధి బండారి అనూష సతీష్ మునిసిపల్ ఛైర్ పర్సన్ కాగా, వైస్ చైర్మన్ గా ఎంఐఎం పార్టీకి చెందిన మహ్మద్ రోహిత్ ఎన్నికయ్యారు. ఆదిలాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ పదవి బీజేపీకి దక్కకుండా కాంగ్రెస్ కైవసం చేసుకోవడంలో కంది శ్రీనివాసరెడ్డి వ్యూహాత్మకంగా డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ తో కలిసి ఇతరుల మద్దతు కూడగట్టి.. సక్సెస్ అయ్యారు. ఆదిలాబాద్ పై కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి పడ్డ శ్రమ ఫలించింది. గత మునిసిపల్ ఎన్నికల్లో ఐదువార్డులకు పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఇపుడు కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగరేసే వరకు సాగింది. టికెట్ల విషయంలో ఆశించినవి జరగకున్నా చివరిదాకా పట్టుబట్టి బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగరేయడంలో కంది కీలకభూమిక పోషించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో పాటు జిల్లా ఇన్ ఛార్జి మంత్రి జూపల్లి క్రిష్ణారావు, ప్రభుత్వ సలహాదారు, పార్టీ పార్లమెంట్ ఇన్ ఛార్జి సుదర్శన్ రెడ్డి , మునిసిపాలిటీ ఇన్ ఛార్జి అజ్మతుల్లా సూచనలకు అనుగుణంగా, డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ తో ఎప్పటికపుడు సమన్వయం చేసుకుంటూ రాజకీయాన్ని రక్తి కట్టించారు. మాజీ మంత్రి జోగురామన్నతో మాట్లాడి మద్దతుకు ఒప్పించిన కంది శ్రీనివాసరెడ్డి చివరినిమిషం దాకా కాంగ్రెస్ పట్టును కొనసాగించి, ఏ దశలోనూ ఏ ఒక్కరు కూడా బీజేపీ వైపు ఆలోచించకుండా చేసి విజయాన్ని కాంగ్రెస్ వైపు లాగారు. కంది శ్రీనివాసరెడ్డి పట్టుదలతో బల్దియా కాంగ్రెస్ పరం కాగా, కాంగ్రెస్ శ్రేణుల్లో మళ్లీ ఉత్సాహం నెలకొంది. ఆదిలాబాద్, నిర్మల్ పీఠాలు కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో మళ్ళీ ఆదిలాబాద్ జిల్లా రాజకీయాలపై రెండేళ్ళ తర్వాత కాంగ్రెస్ కు పట్టుచిక్కినట్లయింది.
……








