సంగారెడ్డి ప్రతినిధి: మహా:
ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకొని, వారి కష్టసుఖాల్లో తోడుండే వారే నిజమైన నాయకులుగా గుర్తింపు పొందుతారని టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. సోమవారం సదాశివపేట మున్సిపల్ నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లను సదాశివపేట మార్కెట్ కార్యాలయం ఆవరణలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదవులు వస్తుంటాయి పోతుంటాయి రాజకీయంలో పదవులు శాశ్వతం కాదు ఆమె అన్నారు. రాజకీయం అంటే అధికారం చలయించడం కాదు ప్రజల హృదయాలను గెలవాలన్నారు. తమను నమ్మి ఓటేసిన ప్రజలకు ఆపదలో ఉంటే భరోసా కల్పించాలన్నారు.కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, క్రమశిక్షణతో సేవ చేయాలని కౌన్సిలర్లకు సూచించారు. జగ్గారెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి వార్డుకి 8 కోట్ల నిధుల మంజూరు కాగానే వార్డుల అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సి డి సి చైర్మన్ గడిల రామ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చాట్ల సిద్ధన్న, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.








