Mahaa Daily Exclusive

  ఇప్పుడు అర్థమైంది …కేసీఆర్, కేటీఆర్‌లను సీఎం రేవంత్ ఎందుకు కాపాడుతున్నారో: నిజామాబాద్ ఎంపీ ఎంపీ అర్వింద్

Share

 

నిజామాబాద్, మహా : నిజామాబాద్ నగర మేయర్ పీఠం కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకోవడంతో స్థానిక ఎంపీ, బీజేపీ సీనియర్ నేత ధర్మపురి అర్వింద్ సోమవారం స్పందించారు. మూడు ఓట్ల తేడాతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కాంగ్రెస్ పార్టీ గెల్చుకుందన్నారు. బీజేపీని ఓడించేందుకు బీఅర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఒకటయ్యాయని మండిపడ్డారు. కాళేశ్వరం, ఈ కార్ రేసింగ్ తదితర కేసుల్లో బీఆర్ఎస్ అధినేతలు కేసీఆర్, కేటీఆర్‌లను సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నారో ఈ రోజు అర్థమైందమన్నారు. ఇందూరులో బీజేపీని ఓడించడానికి అనైతిక పొత్తుకు శ్రీకారం చుట్టారంటూ అర్వింద్ నిప్పులు చెరిగారు. బీజేపీ ఓటమిలో కాంగ్రెస్ రంగు పూసుకుని తిరిగే పోలీసుల హస్తం కూడా ఉందని ఈ సందర్భంగా ఆరోపించారు. ఈ ఐదేళ్ల పదవి పూర్తయ్యేలోపు ఈ ఫలితాన్ని రివర్స్ చేసి చూపిస్తామని ఆయన శపథం చేశారు. అయితే ఈ మున్సిపల్ ఎన్నికల్లో నైతిక విజయం తమదేనని ప్రకటించారు. ఈ టర్మ్ అయ్యేలోపు కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఎంపీ అర్వింద్ స్పష్టం చేశారు.

Latest