Mahaa Daily Exclusive

  వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు బ్రెయిన్‌ స్ట్రోక్‌….

Share

  • వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు బ్రెయిన్‌ స్ట్రోక్‌
  • హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్‌ ఆస్పత్రిలో అడ్మిట్
  • ఆఁదోళన వద్దు …. నా ఆరోగ్యం బాగానే ఉందన్న బొత్స

హైదరాబాద్, మహా : వైసీపీ నేత, ఏపీ మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్‌కు తరలించారు. శుక్రవారం తెల్లవారుజామున సిటీ న్యూరో సెంటర్‌లో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు చెప్పారు. త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

గతేడాది కూడా ఓసారి బొత్స సత్యనారాయమ అస్వస్థతకు గురుయ్యారు. గతేడాది జూన్ లో విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బొత్స ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే విశాఖపట్నంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అంతకుముందు 2013 లో హైదరాబాద్ లోని కేర్ హాస్పిటల్ లో కూడా బొత్స చికిత్స తీసుకున్నారు. మెదడులో రక్తం గడ్డకట్టగా చికిత్స పొంది పూర్తిగా కోలుకున్నారు.

ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మండలిలో వైసీపీ తరఫున ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ పార్టీ తరపున కీలకంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీకి సూటిగా ప్రశ్నలు సంధిస్తూ మండలిలో తన వాయిస్ ను వినిపిస్తున్నారు. కట్ చేస్తే అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన నేపథ్యంలో ప్రస్తుతం మండలి సమావేశాలకు దూరమయ్యే అవకాశం ఉంది.