హైదరాబాద్, మహా : గత 20 ఏళ్లుగా చర్లపల్లి, విశాఖపట్నం, భువనేశ్వర్, ఒడిస్సాతో పాటు ఆయా జైళ్లలో విచారణ ఖైదీగా ఉన్న సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అమిత్ భక్షీ శుక్రవారం చర్లపల్లి కేంద్ర కారాగారం నుండి విడుదలయ్యారు. ఈ మేరకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బెయిల్ పై విడుదలయ్యారు అమిత్ భక్షీ, ఈయనపై అనేక కేసులు ఉన్నాయి. కొన్ని కేసులను తప్పుడు కేసులుగా భావించి కోర్టు కొట్టి వేసింది. అమిత్ భక్షీ వయస్సు 70 ఏళ్లకు పైగానే ఉంటుంది. అమిత్ భక్షీ 2010 నుండి చర్లపల్లి కేంద్రకారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు. అమిత్ భక్షీ విడుదలను జైలు అధికారులు ధృవీకరించారు.
Post Views: 4








