విజయవాడ, మహా: కొత్త కంపెనీల ఆకర్షణలో ఏపీ దూసుకుపోతోంది. ఆంధ్రప్రదేశ్‌కు మరో కీలక సంస్థ రానుంది. అమెరికా-జపాన్ సంయుక్త సంస్థ ప్రొటీరియల్.. తిరుపతి జిల్లా శ్రీసిటీలో ఎలక్ట్రికల్ స్టీల్ సిటీ కర్మాగారం ఏర్పాటు చేయనుంది. మెట్‌గ్లాస్ ఇండియా పేరుతో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అల్లాయ్ రిబ్బన్‌ను ఇది ఉత్పత్తి చేయనుంది. ఈ సంస్థ తొలి దశలో 77 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. 200 మందికి నేరుగా ఉద్యోగాలు కల్పించనున్నారు. 2026 అక్టోబర్ నుంచి సంస్థ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు సీఈవో శాన్‌స్టాక్ తెలిపారు. అధునాతన జపాన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ ప్లాంట్‌లో వినియోగిస్తామని ప్రొటీరియల్ సంస్థ తెలిపింది.
Post Views: 19








