హైదరాబాద్
టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు, వేం నరేందర్ రెడ్డి గారిని నేతలు శాలువాతో సత్కరించి అభినందించారు.
అనంతరం తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎంపికైన వేం నరేందర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారిక అభ్యర్థిగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు భీ ఫాం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ గారు, విజయరమణ రావు గారు, గండ్ర సత్యనారాయణ గారు, చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి గారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ గారు పాల్గొన్నారు.
Post Views: 10








