మహా
భారత వాయుసేనలో కీలకమైన సుఖోయ్ (ఎస్ యూ-30ఎంకేఐ) యుద్ధ విమానం అదృశ్యమవడం కలకలం రేపింది. రాడార్‌తో సంబంధాలు తెగిపోవడంతో విమానం ఆచూకీ గల్లంతైంది. ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే అప్రమత్తమైన అధికారులు, విమానం ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విమానం రాడార్ పరిధి నుంచి హఠాత్తుగా మాయమైందని, పైలట్ల రక్షణ కోసం వెంటనే సెర్చ్ అండ్ రెస్క్యూ మిషన్‌ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర రావత్ స్పందించారు. విమానం రాడార్ కాంటాక్ట్ కోల్పోయిన మాట వాస్తవమేనని, ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్లు ముమ్మరంగా సాగుతున్నాయని ఆయన వెల్లడించారు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.
Post Views: 15








