- మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి:సీఐ రవికుమార్
- ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
- మహిళ పోలీస్ సిబ్బందికి ఘనంగా సన్మానం
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. మహిళా సాధికారతకు గుర్తింపుగా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బి రవికుమార్ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు వెంకటేష్, నోయల్ రాజు, సత్యనారాయణ, సైదయ్యలు, పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీస్ సిబ్బందితో పాటు జీఎంఆర్ సంస్థకు చెందిన మహిళా సిబ్బందిని శాలువాలు కప్పి మెమెంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఆదిభట్ల పోలీసులు, మహిళా సిబ్బంది మరియు జీఎంఆర్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని, మహిళా దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ బి రవికుమార్ మాట్లాడుతూ… సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, ప్రతి రంగంలో మహిళలు ముందుకు రావడం ఆనందదాయకమని తెలిపారు. మహిళలు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మహిళా సిబ్బంది శోభ, శ్రావణి, శారద, అఖిల, పూజిత, అనుష, రజనీ, కావేరి, పద్మజ, భాను రేఖ, కృష్ణవేణి, శిల్ప, భార్గవి, స్వప్న లు కలిసి కేక్ కట్ చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు.







