Mahaa Daily Exclusive

  సంజూ ‘సూపర్’ ఇన్నింగ్స్ – రికార్డులన్నీ స్మాష్..

Share

మహా ప్రత్యేకం

సంజూ శాంసన్ ను ఫ్యాన్స్ ఆకాశానికెత్తుతున్నారు. టీమిండియాలో ఆయా షేర్ అంటూ మీమ్స్, సాంగ్స్ తో అభిమానం చాటుకుంటున్నారు. మ్యాచ్​తో శాంసన్, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేశాడు. సింగిల్ వరల్డ్ కప్ ఎడిషన్​లో భారత్ తరఫున అత్యధిక పరుగుల బాదిన క్రికెటర్​గా రికార్డు సృష్టించాడు. ప్రస్తుత ఎడిషన్​లో శాంసన్ 5 మ్యాచ్​ల్లోనే 80.25 యావరేజ్​తో 321 రన్స్ చేశాడు. దీంతో విరాట్ రికార్డ్ బ్రేక్ అయ్యింది. 2014లో విరాట్ 319 పరుగులు చేశాడు. 12ఏళ్లుగా ఈ రికార్డ్ ఇలాగే కొనసాగింది. ఇప్పుడు దీన్ని శాంసన్ బ్రేక్ చేశాడు. ఈ టోర్నీలో శాంసన్ ఇప్పటిదాకా 24 సిక్స్​లు బాదాడు,. ఈ క్రమంలో టీ20 వరల్డ్​కప్​ హిస్టరీలో సింగిల్ ఎడిషన్​లో అత్యధిక సిక్స్​లు బాదిన క్రికెటర్​గా రికార్డు కొట్టాడు. ఈ సీజన్​లోనే కివీస్ బ్యాటర్ టిమ్ సీఫెర్ట్ (20 సిక్స్​లు) ను అధిగమించాడు
ఈ మ్యాచ్​లో 89 పరుగులు చేసిన శాంసన్, టీ20 ఫైనల్​లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన బ్యాటర్​గా రికార్డ్ కొట్టాడు. ఈ క్రమంలో విండీస్ మాజీ క్రికెటర్ శామ్యూల్స్ (85 పరుగులు) రికార్డ్​ను బ్రేక్ చేశాడు

టీ20 వరల్డ్​కప్​లో సెమీస్‌తోపాటు ఫైనల్​లోను 50+ స్కోర్ బాదిన క్రికెటర్లు

2009- షాహిద్ అఫ్రిది- పాకిస్థాన్
2014- విరాట్ కోహ్లీ- భారత్
2026- సంజు శాంసన్- భారత్
T20 వరల్డ్​కప్​లో వరుసగా అత్యధిక 50+ స్కోర్లు

3 – మహేల జయవర్ధనే (2010)
3 – విరాట్ కోహ్లీ (2016, 2021)
3 – బాబర్ ఆజామ్ (2021)
3 – కేఎల్ రాహుల్ (2021)
3 – కుశాల్ మెండిస్ (2026)
3 – సాహిబ్జాదా ఫర్హాన్ (2026)
3 – సంజు శాంసన్ (2026)

Latest