Mahaa Daily Exclusive

  విజయవాడ టు హైదరాబాద్..! హైదరాబాద్‌లో బయటపడ్డ ఉగ్రలింకులు..

Share

  • విజయవాడ టు హైదరాబాద్
  • హైదరాబాద్‌లో బయటపడ్డ ఉగ్రలింకులు
  • మహిళను అరెస్టు చేసిన కౌంటర్ ఇంటలీజెన్స్ పోలీసులు
  • విజయవాడకు తరలింపు
  • మరికొంత మంది కోసం గాలింపు ముమ్మరం

హైదరాబాద్, మహా : విజయవాడలో పట్టుబడ్డ ఉగ్రలింకులున్న వారితో సంబంధం ఉన్న ఒక మహిళను కౌంటర్ ఇెటలీజెన్స్ పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. ఈ అరెస్టుతో మరోసారి తెలంగాణ పోలీసులు ఉలిక్కి పడ్డారు. తీవ్రవాద కార్యకలపాలకు పాల్పడుతున్నారన్న సమచారంలో ఒక మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ లో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు సోమవారం ముగ్గురిని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. కాగా వారిచ్చిన సమాచారంతో పోలీసులు పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా హైదరాబాద్‌లో మరోసారి ఉగ్రలింకులు బయటపడ్డాయి. హైదరాబాద్‌కు చెందిన సయిదాబేగం అనే మహిళను కౌంటర్ ఇంటెలిజెన్స్ వర్గాలు అరెస్టు చేశాయి. విజయవాడ ఉగ్రలింకుల కేసులో సయిదా బేగం కీలక పాత్ర పోషించినట్లు అధికారులు కీలక సమాచారాన్ని కూడా సేకరించారు.

 

విజయవాడలో అరెస్ట్‌ చేసిన ఉగ్రవాద గ్రూపులకు చెందిన సానుభూతిపరులు మహమ్మద్ రహమతుల్లా, డానిష్, సొహైల్ బేగ్‌లను కౌంటర్ ఇెటలీజెన్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వారిచ్చిన సమాచారంతో పలు రాష్ట్రాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఈ ఉగ్రకుట్రలు హైదరాబాద్ లోనూ ఉన్నాయని తేలింది. దీంతో అప్రమత్తమైన కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు నగరంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టి సయిదా బేగం అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను విచారించి ఉగ్ర లింకుల కేసులో సయిదా బేగం ప్రధాన పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు. అనంతరం ఆమెను విజయవాడకు తరలించారు.

 

గత ఏడాది జూన్ లో గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశారు. దీంతో సయిదా బేగం తో పాటు మిగతా సానుభూతిపరులు అప్రమత్తమయ్యారు.. పోలీసులకు తమపై ఎటువంటి అనుమానం రాకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో “అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్” పేరుతో సంస్థను ఏర్పాటు చేసుకున్నారు.-పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తపడ్డ 12మంది టెర్రరిస్టుల గ్యాంగ్– హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా పేలుళ్లకు స్కెచ్‌ గీచినట్లు బయటపడింది. ఈ ఉగ్రలింకులు. వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, కర్ణాటక, బీహార్, మహారాష్ట్ర, ఢిల్లీ వరకు విస్తరించినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వీరిని అదుపులోకి తీసుకున్న అధికారులు మిగిలిన వారి ఆచూకీ కోసం గాలింపును ముమ్మరం చేశారు.

Latest