Mahaa Daily Exclusive

  మంత్రుల స్వార్థం – ఏజెన్సీకి అన్యాయం: సీతారామ ప్రాజెక్టు నిధుల కోతపై రైతు సంఘాల గళం

Share

  • సొంత నియోజకవర్గాలకే మంత్రుల ప్రాధాన్యత
  • ఏజెన్సీ నియోజకవర్గాల నిర్లక్ష్యం
  • వైరా, ఇల్లందు శాసన సభ్యులు సాగు నీరు కోసం గళం విప్పాలి
  • సీతారామ ప్రాజెక్టు నిధులు లేమికి ముగ్గురు మంత్రులదే భాధ్యత
  • తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు,
    ఉపాధ్యక్షులు దుగ్గి కృష్ణ
  • సంక్షేమ పథకాలు కేటాయింపులు పెంచాలి
  • వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండె బోయిన నాగేశ్వరరావు

కారేపల్లి, మహా :జిల్లా లోని ముగ్గురు మంత్రులు తమ సొంత నియోజకవర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ గిరిజన నియోజకవర్గాలకు అన్యాయం చేస్తున్నారని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, ఉపాధ్యక్షులు దుగ్గి కృష్ణ విమర్శించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు లక్షల ఎకరాల భూమి కి సాగు నీరు అందించే సీతారామ ప్రాజెక్టు పూర్తిచేయాలి అందుకు అవసరమైన నిధులు బడ్జెట్లో కేటాయింపులు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కారేపల్లి క్రాస్ రోడ్లో తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు , వజ్జా రామారావు అధ్యక్షతన జరిగిన సదస్సు లో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, ఉపాధ్యక్షులు దుగ్గి కృష్ణ మాట్లాడుతూ
సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయుటకు అవసరమైన నిధులు బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా ముగ్గురు మంత్రులు తమ సొంత నియోజకవర్గ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తు గిరిజన నియోజకవర్గాలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు . గిరిజన నియోజకవర్గాలకు సాగు నీరు అందించేందుకు వైరా, ఇల్లందు శాసన సభ్యులు గళం విప్పాలి అని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం 2026-27 ఆర్ధిక సంవత్సరం కు శాసనసభ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా లో ఏడు లక్షల ఎకరాల భూములకు సాగునీరు అందించే సామర్థ్యం ఉన్న సీతారామ ప్రాజెక్టు మిగిలిన పనుల కు 9000 కోట్ల రూపాయలు అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 336 కోట్ల రూపాయలు నిధులు కేటాయింపులు చేయుడం పై ముగ్గురు మంత్రులు భాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.గోదావరి నది పై సీతమ్మ బ్యారేజి నిర్మాణం పూర్తి చేయకుండా సాగు నీరు 2026 ఆగస్టు 15 నాటికి అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైరా రైతు సభలో ప్రకటించారు అని గుర్తు చేశారు. కేసిఆర్ ప్రభుత్వం పూర్తి చేసిన పనులు ఆధారంగా నీరు కొని ప్రాంతాలకు అందించే ప్రయత్నం తప్ప , పాలేరు రిజర్వాయర్ కు అనుసంధానం చేసే పనులు పూర్తి చేయడం లేదని అన్నారు, కారేపల్లి, కామేపల్లి రెండు మండలాల్లో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సాగు నీటి వనరులు కల్పించలేదు అన్నారు, బుగ్గ వాగు మీద విశ్వనాథపల్లి వద్ధ రాజ్య సభ మాజీ సభ్యులు యల్లమంచిలి రాధాకృష్ణ మూర్తి నిధులు నుంచి ఏర్పాటు చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ పనిచేయక పోయినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని అన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి అయిన ప్రధాన కాలువలు ఆధారంగా కామేపల్లి, కారేపల్లి మండలాల్లో భూములకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు విద్యా, వైద్య రంగాలకు నిధులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండె బోయిన నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆక్స్ఫర్డ్, క్రేంబిడ్జి స్థాయిలో తెలంగాణ విద్యార్థులకు విద్యా అందించాలంటే ప్రభుత్వ విద్యా సంస్థలు అన్నింటిలో అత్యంత నాణ్యమైన వసతులు, సౌకర్యాలు కల్పించడం తోపాటు విద్యా లో ఉన్న అంతరాలను రూపు మా పాలని డిమాండ్ చేశారు.
ఇందిరమ్మ భీమా పధకం కుటుంబ సభ్యులు అందరికీ వర్తింపు చేయాలని డిమాండ్ చేశారు, ఇండ్ల స్థలాలు లేని పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అందుకు అవసరమైన నిధులు బడ్జెట్ లో కేటాయించాలని కోరారు. లోపభూయిష్టంగా ఉన్న విద్యా విధానం మూలంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విద్యా విధానాన్ని అన్ని స్థాయిల్లో సంస్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా సినీయర్ నాయకులు ఇంజం నాగభూషణం, సిఐటియు జిల్లా నాయకులు కుందనపల్లి నరేంద్ర, బాదావత్ శ్రీనివాసరావు, రైతు సంఘం మండల అధ్యక్షులు ముళ్ళ ఏకాంబరం, పాసిన్ని నాగేశ్వరరావు, కేసాగని ఉపేందర్, ఏడుకొండలు ,రాంబాబు, విశ్వనాథ పల్లి ఉపసర్పంచ్ ధన్నం, సైదులు నిర్వాసితుల సంఘం నాయకులు షరిఫ్, సంగెం వెంకన్న తదితరులు పాల్గొన్నారు

Latest