కారేపల్లి, మహా:సింగరేణి మండల పరిధిలోని జమ్మలపల్లిలో ఆటో బోల్తా పడి ఆరుగురికి గాయాలు కాగా అందులో ఇద్దరికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
పేరేపల్లి గ్రానికి చెందిన వజ్జ సునీల్ (25) సరదాగా ఆరుగురు చిన్న పిల్లలను ఆటో ఎంకించుకొని
పేరేపల్లి నుండి ఎల్లందు వైపు వెళుతుండగా మధ్యలో మరొక బాలుడుకి ఆటో తొలమని ఇవ్వగా ఆ బాలుడు ఆటో తోలుతూ ఉండగా ఒక్కసారిగా అదుపు తప్పి ఆటో బోల్తా పడింది… ఈ ప్రమాదంలో పేరేపల్లి గ్రామానికి చెందిన
పులసం యశ్వంత్, అలెం స్నేహితు,దనసరి భారత్,అలెం తేజ,అలెం చిట్టు,దనసారి ప్రవీణ్ లకు గాయాలయ్యాయి.
గమనించిన స్థానికులు క్షతగాత్రులను కారేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. పులసం యశ్వంత్, అలెం స్నేహితు కి సీరియస్ గా ఉన్నట్టు సమాచారం…
Post Views: 568








