Mahaa Daily Exclusive

  కేంద్ర మంత్రి శోభా కరంద్లాజేకు ఘన స్వాగతం….

Share

  • కేంద్ర మంత్రి శోభా కరంద్లాజేకు ఘన స్వాగత
  •  ఎంఎస్ఎంఈ రంగాల అభివృద్ధిపై కేంద్రం స్పెషల్ ఫోకస్.

హైదరాబాద్, మహా.

 

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) శాఖ సహాయ మంత్రి, పార్టీ సీనియర్ నాయకురాలు శ్రీమతి శోభా కరంద్లాజే రాకతో కమలనాథుల్లో అనూహ్యమైన ఉత్సాహం ఉప్పొంగింది. పార్టీ రాష్ట్ర కేంద్ర కార్యాలయానికి విచ్చేసిన ఆమెకు రాష్ట్ర అధ్యక్షులు నారపురాజు రామచంద్రరావు,ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళా మోర్చా నాయకులు పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో సత్కరించి హృదయపూర్వక స్వాగతం పలికారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సాధిస్తున్న విజయాలు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈ రంగంలో అమలు చేస్తున్న విప్లవాత్మక సంస్కరణలపై ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో ఆమె ముఖాముఖిగా ఆత్మీయంగా ముచ్చటించారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు చేస్తున్న కృషిని అభినందించారు.

దేశ ఆర్థిక పురోగతిలో అత్యంత కీలకమైన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న శోభా కరంద్లాజే పర్యటన పారిశ్రామిక, వ్యాపార వర్గాల్లోనూ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా ‘ఆత్మనిర్భర్ భారత్’ సాధనలో ఎంఎస్ఎంఈ రంగం వెన్నెముకలా పనిచేస్తోందని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఈ రంగం పాత్ర అత్యంత కీలకమని నేతలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో చిన్న, సన్నకారు పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక ప్రోత్సాహకాలు, నైపుణ్యాభివృద్ధి పథకాలను క్షేత్రస్థాయిలోకి, అర్హులైన లబ్ధిదారుల వద్దకు తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపైనే ఉందని ఆమె దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

రాష్ట్రంలో బీజేపీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసి, భవిష్యత్తు లక్ష్యాలను చేరుకునేందుకు జాతీయ నాయకత్వం పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి నాయకులు తరచూ రాష్ట్ర పర్యటనలు చేస్తూ, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.