Mahaa Daily Exclusive

  నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యం: ఎమ్మెల్యే రంగారెడ్డి

Share

  • నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యం: ఎమ్మెల్యే రంగారెడ్డి
  • పట్నంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం
  • నియోజకవర్గం స్థాయి అధికారుల సమీక్ష సమావేశం
  • ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి
  • ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం స్థాయి అధికారుల సమీక్ష సమావేశంలో, ఎమ్మెల్యే రంగారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన, ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, శనివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం స్థాయి, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా, మండల, మున్సిపాలిటీ స్థాయి అధికారుల సమీక్ష సమావేశం, ఆర్డిఓ అనంతరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పాల్గొని ప్రజా సమస్యలపై, అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి, ప్రజలకు ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు చేరేలా చూడాలని, ఎమ్మెల్యే రంగారెడ్డి, అధికారులకు సూచించారు. మార్చి ఆరో తారీకు నుంచి జూన్ 2 వరకు నిర్వహించే 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యచరణలో, ప్రజా సమస్యలు పరిష్కరించాలని అధికారులను కోరారు. ప్రజలనుంచి ఆ సమస్యలు పునారావృతం కాకుండా చూసే బాధ్యత అధికారులదేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్లు గురునాథ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, పిఎసిఎస్ మాజీ చైర్మన్ పాండురంగ రెడ్డి, ఎంపీడీవో పరిమళ నాయక్, బాల శంకర్, రాధా రాణి, శ్రీ వాణి, ఎమ్మార్వో సునీత, సుదర్శన్, ప్రసాదరావు, అయ్యప్ప మున్సిపల్ కమిషనర్లు సుదర్శన్, సత్యనారాయణ రెడ్డి, జిల్లా, మండల స్థాయి అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, రాష్ట్ర జిల్లా మండల స్థాయి నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.