Mahaa Daily Exclusive

  8న కోటమైసమ్మ ఆలయ దుకాణాల వేలం…

Share

 

కారేపల్లి, మహా : ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ ఆలయ దుకాణాల వేలం పాటను ఈనెల 8వ తేదిన ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు దేవాదాయశాఖ ఈవో కొండకింది వేణుగోపాలాచార్యులు, ఆలయ ట్రస్టీ చైర్మన్ డాక్టర్ పర్సా పట్టాభి రామారావు లు తెలిపారు. ఆలయ కార్యాలయంలో బుధవారం వారు మాట్లాడుతూ టెంటు సామాన్లు అద్దెకు ఇవ్వటానికి, కొబ్బరి చిప్పలు పోగు చేసుకొనుటకు ఈ ఏడాది జూలై మాసం నుండి 2027 మే 2027 వరకు ఒక ఏడాది పాటు లీజుకు ఇవ్వటం జరుగుతుందన్నారు. ఆలయంకు చెందిన షాపు నెం.1,2,3,4,5,6,7 షాపులను నెల కిరాయికి బహిరంగ వేలంపాట ద్వారా ఇవ్వటం జరుగుతుందన్నారు. మే 2026 నుంచి ఏప్రిల్ 2027 వరకు షాపులకు లైసెన్స్ కాలపరిమితి 12 నెలలు మాత్రమే ఉంటుందని తెలిపారు. 12 నెలల షాపు కిరాయి మొత్తం సొమ్మును వేలంపాట ముగిసిన వెంటనే చెల్లించి తగు రశీదు పొందవలయును. లేనియెడల పాట రద్దుపరిచి తిరిగి వేలంపాట నిర్వహిస్తామన్నారు. చెల్లించిన డిపాజిట్ తిరిగి ఇవ్వటం జరగదన్నారు. వివరాలకు కార్యాలయంను సందర్శించాలని తెలిపారు.